Rain Water : వర్షపు నీరు ఎప్పుడైనా తాగారా… ఇది ఆరోగ్యానికి మంచిదేనా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rain Water : వర్షపు నీరు ఎప్పుడైనా తాగారా… ఇది ఆరోగ్యానికి మంచిదేనా…?

 Authored By ramu | The Telugu News | Updated on :4 July 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Rain Water : వర్షపు నీరు ఎప్పుడైనా తాగారా... ఇది ఆరోగ్యానికి మంచిదేనా...?

Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా కేరింతలు కొడతారు. వర్షపు నీటితో ఆడుతారు. కొందరైతే వర్షం నీటిని పట్టుకొని తాగేస్తుంటారు. అయితే, మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా.. వర్షపు నీరు తాగడం మంచిదేనా, ఇది ఆరోగ్యానికి లాభమా, నష్టమా. మరి విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం…

Rain Water వర్షపు నీరు తాగితే

వర్షపు నీరు చాలా శుభ్రంగా కనిపిస్తుంది.అంతేకాదు,మీరు చాలా స్వచ్ఛమైనది కూడా. కొంతమంది వీటిని తాగొచ్చు అని చెబితే,మరి కొందరు పెద్దవాళ్లు అస్సలు వర్షపు నీరు తాగకూడదని చెబుతుంటారు. వర్షపు నీరు స్వచ్ఛమైనదే అయినప్పటికీ, ఎందుకు తాగకూడదు అనే ప్రశ్న చాలా మందిలో మొదలవుతుంది. అయితే మంచినీరు అంటే, స్వేదన జలం ఆవిరి నుంచి తయారవుతుంది. కాబట్టి,ఇది చాలా స్వచ్ఛమైన నీరు అంటారు. నీరు శుద్ధి చేయబడడం వలన మలినాలు తొలగిపోయి శుభ్రంగా తయారవుతాయి. కాబట్టి, మంచి నీరును చాలామంది తాగుతుంటారు.అయితే, వర్షపు నీరు కూడా మంచి నీరు లాగానే కదా అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. ఎందుకంటే, మేఘాలు భూమిపై ఉన్న నీటిని ఆవిరి రూపంలో తీసుకుంటాయి. అందువలన ఈ వర్షపు నీరు కూడా మంచినీరే కదా కానీ కొందరు వర్షపునీరు అపరిశుభ్రమైన నీరుగా అనుకుంటారు.

Rain Water వర్షపు నీరు ఎప్పుడైనా తాగారా ఇది ఆరోగ్యానికి మంచిదేనా

అసలు మంచినీరు బహిరంగ ప్రదేశాలలో తయారుచేయబడునందున అవి సురక్షితమైన నీరుగా పరిగణిస్తారు. కానీ,వర్షపు నీరు మేఘాలు కణాల రూపంలో నీటిని స్వీకరిస్తుంది. ఆ సమయంలో అది నీటితోపాటు అనేక మలినాలను కూడా తీసుకెళుతుందట.ముఖ్యంగా, దుమ్ము,మట్టి,SO2-NOX ఎక్స్ వంటి వాయువులు కీటకాలను మోసుకెళ్లి తిరిగి వస్తుంది. అందుకే,వర్షపు నీరు తాగరాదని, అవి పనికి రావని అంటున్నారు నిపుణులు. కొంతమంది వర్షపు నీరు చూడడానికి చాలా శుభ్రంగా ఉంటాయని తాగుతుంటారు. కానీ, ఎప్పుడూ అలా చేయకూడదు. వాటిని పరీక్షించిన తర్వాతే తాగాలి. ఎందుకంటే వాటిలో ఎక్కువగా మలినాలు ఉండే అవకాశం ఉంది. ఇవి తాగితే జలుబు, దగ్గు,వైరల్ ఫీవర్ వంటివి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. ముఖ్యంగా,మొదటిసారి కురిసే వర్షంలో తడవడం, ఆ నీటిని తాగటం అనేది అసలే మంచిది కాదంట. ఎందుకంటే,మొదటిసారి కురిసే వర్షం నీరులో వాతావరణం నుండి వచ్చే ధూళి కాలుష్య కణాలను ఎక్కువగా కలిగి ఉంటుందట. ఇది శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.అందుకే మొదటిసారి కురిసే వర్షంలో తడవకూడదు అంటున్నారు నిపుణులు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది