Black Rice : బ్లాక్ రైస్ ఎప్పుడైనా తిన్నారా… వీటిని ఎలా తినాలి, ఈ రైసు ఏ వ్యాధులను నివారిస్తుంది… మీకు తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Black Rice : బ్లాక్ రైస్ ఎప్పుడైనా తిన్నారా… వీటిని ఎలా తినాలి, ఈ రైసు ఏ వ్యాధులను నివారిస్తుంది… మీకు తెలుసా…?

 Authored By aruna | The Telugu News | Updated on :10 March 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Black Rice : బ్లాక్ రైస్ ఎప్పుడైనా తిన్నారా... వీటిని ఎలా తినాలి, ఈ రైసు ఏ వ్యాధులను నివారిస్తుంది... మీకు తెలుసా...?

Black Rice : మార్కెట్లలో కొన్ని రకాల రైస్ ని మనం చూస్తూ ఉంటాం. అందులో మనం ఎక్కువగా వైట్ రైస్ ని వినియోగిస్తుంటాం. బ్రౌన్ రైస్ కూడా మంచిదని మనకి తెలుసు. అలాగే, మార్కెట్లలో బ్లాక్ రైస్ కూడా దొరుకుతుంది. దీనిని కూడా రైతులు పండిస్తారు. ఈ బ్లాక్ రైస్ ని పర్పుల్ రైస్ లేదా నిషిద్ధ బియ్యం అని కూడా పిలుస్తారు. రైస్ కూడా మనకి మార్కెట్లలో అందుబాటులో మనకు లభిస్తుంది. ఈ బ్లాక్ రైస్ అనగానే అందరికీ ఆసక్తి కలుగుతుంది. తెల్ల బియ్యం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే, ఈ నల్ల బియ్యం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ బ్లాక్ రైస్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందిస్తూ, అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇందులో, ప్రోటీన్లు, విటమిన్లు, ఐరన్, ఫైబర్, ఖనిజాలతో నిండి ఉంటుంది. దీనిలో ప్రధానంగా ఆంథోసైనిన్ అనే రంగు పదార్థం ఉండడంతో దీనికి నల్లటి వర్ణం వస్తుంది.

Black Rice బ్లాక్ రైస్ ఎప్పుడైనా తిన్నారా వీటిని ఎలా తినాలి ఈ రైసు ఏ వ్యాధులను నివారిస్తుంది మీకు తెలుసా

Black Rice : బ్లాక్ రైస్ ఎప్పుడైనా తిన్నారా… వీటిని ఎలా తినాలి, ఈ రైసు ఏ వ్యాధులను నివారిస్తుంది… మీకు తెలుసా…?

Black Rice బ్లాక్ రైస్ ఉపయోగాలు

ఈ బ్లాక్ రైసు తీసుకోవడం వలన, గుండె సమస్యలు తగ్గుతాయి. ప్రస్తుతం చాలామంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. అటువంటి వారికి ఈ బ్లాక్ రైస్ ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం, సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం వలన మన గుండెని కాపాడుకోవచ్చు. బ్లాక్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్ లో కలిగి ఉండడం చేత గుండె పనితీరును మెరుగుపరిచి రక్తనాళాలను శుభ్రం చేస్తుంది. ఈ రైస్ లో ఫ్లేవనాయిడ్లు, ఉండ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఏడు కొలెస్ట్రాల స్థాయిలను తగ్గిస్తుంది. తద్వారా వచ్చే రక్తపోటును అదుపులో ఉంచగలదు.
బ్లాక్ రైస్ లో ఉన్న ఆంథోసైన్ ఇన్ క్యాన్సర్ కారకాల కణాల పెరుగుదలను అడ్డుకుంటుందని కొన్ని పరిశోధనలు వెల్లడించారు. ముఖ్యంగా మహిళలలో వచ్చే రొమ్ము క్యాన్సర్, కాలయుక్త క్యాన్సర్ ( కోలోరెక్టల్ క్యాన్సర్ ) వంటి సమస్యల నుంచి రక్షణ కలిగించే గుణాలు ఇందులో ఉన్నాయి. ఇది శరీరాన్ని కాపాడుటకు చక్కటి రక్షణ కవచంలా పనిచేస్తుంది.

కంటి ఆరోగ్యం కాపాడుతుంది

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్, ల్యాప్టాప్ లా వంటి వాడకం వల్ల కంటి చూపు సమస్యలు పెరుగుతున్నాయి. ఇంటి చూపుని కాపాడగలిగే ముఖ్యమైన పోషకాలు ల్యూటిన్, జియాక్సoతిన్, ఈ బియ్యంలో ఎక్కువగా ఉంటాయి. ఇవి కళ్ళను హానికరమైన కిరణాల ప్రభావం నుంచి రక్షిస్తాయి. కావున ఈ బ్లాక్ రైస్ తప్పకుండా ఆహారంలో చేర్చుకుంటే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

బ్లాక్ రైస్ బరువు తగ్గిస్తుంది

బరువు తగ్గాలి అనుకునే వారికి బ్లాక్ రైస్ మంచి ఆహారం. ఈ రైస్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కావున కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో అధికంగా తినడం తగ్గించవచ్చు. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. కొవ్వును కరిగించి వేస్తుంది. అధ్యయనాలు ప్రకారం నిత్యం తెల్లబియ్యానికి బదులు బ్లాక్ రైస్ తీసుకునే వారు త్వరగా బరువు తగ్గుతారని పరిశోధనలో తేలింది.

డయాబెటిస్

టైప్ టు డయాబెటిస్ ఉన్నవారు ఈ బ్లాక్ రైస్ ని తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించవచ్చు. ఈ రైస్ లో ఆంథోసైనిన్ ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపరిచే రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. పరిశోధనల ప్రకారం ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యను కూడా తగ్గించగలరని తేలింది.

ఆ క్రైస్తని ఏ విధంగా వినియోగించాలి

బ్లాక్ రైస్ ని వండడానికి ప్రత్యేకమైన ప్రక్రియ అవసరం లేదు. సాధారణంగా తెల్ల బియ్యాన్ని వండే విధానం దీనికి ఉండవచ్చు. కానీ, ఈ రైసు కాస్త గట్టిగా ఉండడంతో. ముందుగా 6 నుంచి 8 గంటల పాటు నీటిలో నానబెడితే మంచిది. ఆ తరువాత నానబెట్టిన బియ్యాన్ని కుక్కర్లో లేదా స్టవ్ పై ఉడికించాలి. తినే ముందు ఫోర్క్ లేదా స్పూన్ తో కలిపితే మరింత మృదువుగా మారుతుంది.
ఈ రైస్ ని ఎక్కువగా ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకుంటే మంచిది. రాత్రి సమయంలో తీసుకుంటే జీర్ణ క్రియకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. దీనిని ఎక్కువగా సాంబార్, కూరలతో కలిపి తినొచ్చు. బియ్యంతో కొందరు ప్రత్యేకమైన పాయసం కూడా తయారు చేసుకుంటారు. రైస్ కి బదులు మన రోజువారి ఆహారంలో బ్లాక్ రైస్ ని చేర్చుకుంటే మనం నిత్యం ఆరోగ్యంగా ఉండవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది