Black Milk : మీరు నల్ల పాలు ఇచ్చే జంతువు గురించి విన్నారా…దీనిలో కొవ్వు 0%..!
ప్రధానాంశాలు:
Black Milk : మీరు నల్ల పాలు ఇచ్చే జంతువు గురించి విన్నారా...దీనిలో కొవ్వు 0%..!
Black Milk : ప్రతి ఒక్కరి ఇంట్లో పాల వినియోగం అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే ఆవు పాలు మరియు గేదె పాలను ఇంటి అవసరాలకు అనగా టీ, కాఫీ,పెరుగు కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే పిల్లలు మరియు పెద్దలు కూడా పాలను తాగుతూ ఉంటారు. కొందరైతే మేకపాలను కూడా తాగుతూ ఉంటారు. అయితే ఈ పాలు అన్నీ కూడా తెల్లగా ఎంతో స్వచ్ఛంగా ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ ఒక జంతువు పాలు మాత్రం నల్లగా ఉంటాయి ఆ విషయం మీకు తెలుసా. నిజం. చాలా జంతువులు పాలు ఎంతో తెల్లగా ఉంటాయి. కానీ నల్ల పాలను ఇచ్చే జంతువు గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
మన ఆరోగ్యకరమైన జీవితానికి మంచి ఆహారం ఎంతో అవసరం. అలాగే పిల్లల పోషణకు కూడా పాలు ఎంతో అవసరం. అయితే దాదాపుగా పిల్లలందరికీ తల్లి పాలను ఎక్కువగా పడుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం పిల్లలకు ఆవుపాలు లేక గేద పాలు తాపిస్తారు. అయితే పిల్లలతో పాటు పెద్దలు కూడా పాలను తాగాలి అని వైద్యులు చెబుతూ ఉంటారు. కానీ పాల రంగు విషయాని కొస్తే మాత్రం ఎంతోమంది పాలు తెలుపు రంగులోనే ఉంటాయి అంటారు. అంతేకాక మీరు లేత పసుపు రంగు పాలను కూడా చూసే ఉంటారు. అయితే ఎప్పుడైనా మీరు నల్ల రంగు పాలను చూశారా. పోనీ దాని గురించి విన్నారా. లేదు కదా. బహుశా మీరు కూడా ఇలాంటి వాటి గురించి విని ఉండకపోవచ్చు…
ఈ నల్ల పాలను చాలా తక్కువ మంది మాత్రమే చూసి ఉంటారు. అయితే ఈ నల్ల రంగు పాలు అనేవి ఆడ నల్ల ఖడ్గం మృగం నుండి వస్తాయి. వాటిని ఆఫ్రికన్ బ్లాక్ ఖడ్గ మృగం అని పిలుస్తారు. అయితే ఈ ఖడ్గం మృగం ఇచ్చే పాలు పూర్తిగా నల్లని రంగులో ఉంటాయి. అయితే ఈ పాలలో కొవ్వు అనేది అసలు ఉండదు అని అంటున్నారు. అంతేకాక ఈ పాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి అని అంటున్నారు. మన శరీరానికి అవసరమైన పోషకాలు ఈ పాల వలన పొందవచ్చు అని అంటున్నారు. ఈ ఖడ్గ మృగం తల్లిపాలల్లో నీరు అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పాలలో 0.2 శాతం మాత్రమే కొవ్వు ఉంటుంది. ఈ నల్లని పాలు అనేవి జంతువుల పునరుత్పత్తి ప్రక్రియను నెమ్మదిస్తుంది అని నిపుణులు అంటున్నారు. అందుకే నల్ల ఖడ్గ మృగాలు నాలుగు నుండి ఐదు ఏళ్ల వయసు వచ్చిన తర్వాత మాత్రమే పునరుత్పత్తి చేయగలవు. ఇవి మాత్రమే కాక వాటి గర్భం అనేది సాధారణ కంటే ఎక్కువ. ఇవి ఒక సంవత్సరం కంటే ఎక్కువ గర్భాన్ని మోస్తాయని పరిశోధకులు తెలిపారు…