Buddhas Hand : చేతి వేళలా కనిపించే బుద్ధ హస్త పండుని మీరు చూశారా… ప్రమాదకరమైన వ్యాధులకు చెక్…?
ప్రధానాంశాలు:
Buddhas Hand : చేతి వేళలా కనిపించే బుద్ధ హస్త పండుని మీరు చూశారా... ప్రమాదకరమైన వ్యాధులకు చెక్...?
Buddhas Hand : ప్రపంచం లో ఇలాంటి ప్రత్యేకమైన పండు ఒకటి ఉందని మీకు తెలుసా. ఈ పండుని చాలా మంది చూసి ఉండరు. ఈ పండు భారతదేశంతో పాటు చైనాలో కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. ఈ పండు పేరు బుద్ధ హస్తం అని పిలుస్తారు. ఇది ఎంతో ప్రత్యేకమైన పండు. భారత దేశంలో ఈశాన్యంలో కనిపిస్తుంది. ఈ పండు చూడడానికి బుద్ధుని ధ్యాన హస్తం లా కనిపిస్తుంది. కాబట్టి,ఈ పండుకి బుద్ధ హస్తమని పేరు వచ్చింది. బుద్ధ హస్తాన్ని బుష్ కాన్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక సీక్రెట్ పండు. ఈ పండులో విటమిన్ సి ఉంటుంది. ఇన్ని రంగు నిమ్మ తొక్క కలర్ లో ఉంటుంది. మంచి సువాసనను కూడా కలిగి ఉంటుంది. జామ్,మార్మలాడే ఈ పండు నుండి తయారుచేస్తారు. పండు నుంచి పెర్ఫ్యూమ్ కూడా తయారు చేస్తారు. ఎన్నో రకాల వ్యాధులకు కూడా దివ్య ఔషధంలా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.

Buddhas Hand : చేతి వేళలా కనిపించే బుద్ధ హస్త పండుని మీరు చూశారా… ప్రమాదకరమైన వ్యాధులకు చెక్…?
Buddhas Hand బుద్ధ హస్త పండు ఆరోగ్య ప్రయోజనాలు
పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇది ఎంతో ప్రత్యేకమైన పండు. శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా, విటమిన్లు A, Cలతో పాటు ఫైబర్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు ఈ పండులో సమృద్ధిగా ఉంటాయి. ఈ పండు లో ఉండే ఫైబర్ కారణంగా, కడుపుబ్బరం, కడుపునొప్పి, అజీర్తి, మలబద్ధకం,విరోచనాలు వంటి సమస్యలను తగ్గించగలదు.
బుద్ధ హస్తం పండులో ఫ్లేవనాయిడ్స్,కౌమర్రింగ్స్, విటమిన్ C,లు ఉంటాయి. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్లు మాదిరిగా పనిచేస్తాయి. శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ నిర్మూలిస్తుంది. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి,వాపులు తగ్గిపోతాయి.గుండె జబ్బులు, క్యాన్సర్లు, వయసు మీద పడటం వల్ల వచ్చే రోగాలు కూడా తగ్గించే శక్తి ఉంటుంది.ఇంకా నొప్పులను తగ్గించే దివ్య ఔషధారమైన పండు.
పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీనితో శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడ గలుగుతుంది. సీజనల్గా వచ్చే దగ్గు, జలుబు,జ్వరం వంటి వ్యాధుల్లోని వారిస్తుంది.హైబీపీ వారికి ఈ పండు ఎంతగానో మేలు చేస్తుంది. స్త్రీలు ఋతు సమయంలో ఈ పండ్లను తింటే పలు రకాల నొప్పులు నుంచి ఉపశమనం పొందవచ్చు. ఋతు సమయంలో వచ్చే కడుపునొప్పిని తగ్గించగలదు. బుద్ధ హస్త పండులో కౌమారి, లైమోనిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇది అనాల్జేసిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల నొప్పులు తగ్గుతాయి. వాపుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా, ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. కీళ్లు,మోకాళ్ల నొప్పులు, వాపులు తగ్గించగలదు. కాదు, ఈ పండ్లను తింటే ఒత్తిడి, ఆందోళనలు కూడా తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంటున్నారు నిపుణులు.