Brown Sugar : బ్రౌన్ షుగర్ ను తీసుకోవడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Brown Sugar : బ్రౌన్ షుగర్ ను తీసుకోవడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!

 Authored By ramu | The Telugu News | Updated on :29 June 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Brown Sugar : బ్రౌన్ షుగర్ ను తీసుకోవడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా...!

Brown Sugar : బ్రౌన్ షుగర్, వైట్ షుగర్ ఈ రెండిటి రుచి చాలా వేరుగా ఉంటుంది. వైట్ షుగర్ చాలా తియ్యగా ఉంటుంది. వీటిని స్వీట్స్, కేకుల తయారీలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. బ్రౌన్ షుగర్ కంటే వైట్ షుగర్ లోనే ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. వైట్ షుగర్ ను తయారు చేసేటప్పుడు దీనిలో సల్ఫర్ వాడతారు. వైట్ షుగర్ తీసుకోవడం వలన బరువు అధికంగా పెరుగుతారు. బ్రౌన్ షుగర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది బరువును తగ్గించేందుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్రౌన్ షుగర్ వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.  బ్రౌన్ షుగర్ ను చెరుకు నుండి కాకుండా డైరెక్ట్ గా బెల్లం నుండి తయారు చేస్తారు. అందువలన ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. వెట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ లో పోషకాలు అధికంగా ఉంటాయి. దీనిలో పొటాషియం,జింక్, రాగి, భాస్వరం, విటమిన్ b6 లాటి పోషకాలు ఎన్నో ఉన్నాయి.

ఈ పోషకాలు అన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బ్రౌన్ షుగర్ బరువు తగ్గించటంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇది వైట్ షుగర్ కంటే చాలా తక్కువ కెలరీలు ఉంటాయి. ఇది బరువును తగ్గించడంలో కూడా ఎంతో బాగా పని చేస్తుంది. బ్రౌన్ షుగర్ లో కెలరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. కావున బరువు తగ్గటానికిది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాక జీవక్రియను కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. దీనిలో విటమిన్ బి 6, నియాసీన్, పాంతోటేనిక్ ఆమ్లం ఇతర ఖనిజాలు కూడా విడిగా ఉంటాయి. ఇవి చర్మం కోసం యాంటీ ఏజింగ్ కాంపోనెంట్ గా కూడా పనిచేస్తుంది. చర్మం పై ఉన్నటువంటి మృత కణాలను నియంత్రించి,స్క్రబ్ గా పని చేస్తుంది. ఇది చర్మంపై ఉన్నటువంటి మురికిని కూడా నియంత్రిస్తుంది. అలాగే చర్మంపై ఉన్నటువంటి చిన్న మచ్చలను కూడా నియంత్రిస్తుంది. బ్రౌన్ షుగర్ ను తీసుకోవటం వలన జీర్ణ సమస్యలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. దీని వలన మలబద్ధక సమస్య నుండి కూడా ఉపసమరం కలిగిస్తుంది. దీనికోసం రోజు ఉదయాన్నే ఒక గ్లాసు వేడి వాటర్ లో అల్లం ముక్క, ఒక టీ స్పూన్ బ్రౌన్ షుగర్ ను కలుపుకొని తీసుకుంటే మంచిది. అలాగే శరీరంలోని తిమ్మిర్లను తగ్గించేందుకు కూడా బ్రౌన్ షుగర్ ఎంతో సహాయం చేస్తుంది.

Brown Sugar బ్రౌన్ షుగర్ ను తీసుకోవడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా

Brown Sugar : బ్రౌన్ షుగర్ ను తీసుకోవడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!

ఈ బ్రౌన్ షుగర్ లో పొటాషియం అధికంగా ఉంటుంది. కావున కాళ్లు, చేతులలో తిమ్మిర్లతో పాటు నొప్పులను కూడా నియంత్రిస్తుంది. ఈ బ్రౌన్ షుగర్ లో యాంటీ అలర్జీ లక్షణాలను కలిగి ఉంటుంది. అందువలన ఇది ఉబ్బస రోగుల చికిత్సకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అంతేకాక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో పోరాడడానికి సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాటి బ్యాక్టీరియల్ లక్షణాలను బ్రౌన్ షుగర్ కలిగి ఉంటుంది. బ్రౌన్ షుగర్ లో ఎన్నో పోషకా మూలకాలు ఉన్నాయి. దీనిలో ఐరన్,కాల్షియం,పొటాషియం లాంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. దీనిని తయారు చేసేటప్పుడు ఎటువంటి రసాయలను వాడరు. ఇది జీర్ణశక్తిని ఎంతగానో బలపరుస్తుంది. ఇది పీరియడ్స్ క్రాంప్లను కూడా నియంత్రిస్తుంది. స్త్రీలు పీరియడ్స్ టైం లో మరిగించిన నీటిలో ఒక చెంచా బ్రౌన్ షుగర్, అల్లం టీ ఆకులు వేసి తీసుకోవడం వలన నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది