Health Benefits : మామిడి పండు తిన్న వెంటనే నీటిని త్రాగుతున్నారా… అయితే మీకు తప్పదు ముప్పు…
Health Benefits : మామిడి పండ్లు సమ్మర్ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంటాయి ఈ మామిడి పండ్లను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు మామిడికాయలతో ఎన్నో వెరైటీలు చేసుకొని తింటుంటారు. ఆవకాయ చట్నీ, మామిడికాయ జ్యూస్ ,మామిడికాయ ముక్కలు ఉప్పు కారం కలిపి తింటుంటారు. మామిడికాయ తాండ్ర ఇలా ఎన్నో రకాలుగా చేసుకుని తింటుంటారు.
ఈ మామిడికాయలలో ఎన్నో రకాలు ఉంటాయి. నీలాలు, జలాలు ,గులాబీలు, రసాలు, బంగినపల్లి ,తోటపురి, పిండి మామిడి ఇలా చాలా రకాలు ఉంటాయి. ఎక్కువగా రసాలు, బంగినపల్లి మామిడి పండ్లను తినడానికి వాడుతూ ఉంటారు వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉంటాయి.
ఇవి మన శరీరానికి ఎంతో శక్తి కలిగేలా ఉపయోగపడుతుంది. దీనిలో పొటాషియం కూడా బాగా ఉంటుంది అలాగే ఫైబర్ కూడా ఉంటుంది దీని వలన జీర్ణ సంబంధిత సమస్యలు మలబద్ధకం లాంటి సమస్యలు దూరం అవుతాయి ఇలాంటి లాభాలు ఉన్న మామిడిపండును తిన్న తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతున్నారు నిపుణులు అయితే మామిడిపండును కొందరు పెరుగన్నంలో కలుపుకొని తింటుంటారు. అలా తినడం వల్ల గ్యాస్ ,కడుపు ఉబ్బరం, కడుపులో మంట ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఇంకా మామిడి పండ్లను తీసుకున్న తర్వాత చేదుగా ఉండే పదార్థాలు తీసుకోవద్దు ఇలా తీసుకోవడం వలన వాంతులు, విరోచనాలు , కడుపులో వికారం లాంటి సమస్యలు అన్ని తలెత్తుతాయి.
అలాగే కొందరు మామిడిపండు ముక్కలు గా చేసి దానిలో పాలు చక్కెర వేసి జ్యూస్ లాగా చేస్తూ ఉంటారు అలా అసలు చేయవద్దు అలా చేయడం వలన మన శరీరంలోని చక్కెర స్థాయి బాగా పెరిగి అనేక సమస్యలు వస్తాయి. అలాగే మామిడి పండ్లను తిని వెంటనే నీళ్లు తాగుతూ ఉంటారు అలా త్రాగడం వలన మన ఆరోగ్యానికి చాలా ముప్పు అని చెబుతున్నారు నిపుణులు మామిడి పండును తిని వెంటనే నీటిని త్రాగడం వలన ఉదర సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి అలాగే గ్యాస్, తిన్నది జీర్ణం అవ్వకుండా చేయడం ఇలాంటి జరుగుతుంటాయి అలాగే మామిడి పండ్లను ఎక్కువగా తీసుకున్నా గానీ మన శరీరంలో వేడిని ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది అందుకే మామిడి పండ్లను సరి అయిన పద్ధతిలోనే తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు