Health Benefits : అంతులేని కాల్షియాన్ని అందించే నువ్వుల ఉండల గురించి మీకు ఈ విషయాలు తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : అంతులేని కాల్షియాన్ని అందించే నువ్వుల ఉండల గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

 Authored By pavan | The Telugu News | Updated on :24 April 2022,5:00 pm

Health Benefits : అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు అందరికీ కాల్షియం కచ్చితంగా కావాల్సిందే. అయితే రోజుకి 450 మిల్లీ గ్రాముల కాల్షియం మన శరీరానికి అవసరం. వయసులో ఉన్న పిల్లలకు అయితే 600 మిల్లీ గ్రాములు, 20 సంవత్సరాల లోపు ఉండే వారందరికీ 500 మిల్లీ గ్రాముల కాల్షియం కావాల్సి ఉంటుంది. కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారు అవడమే కాకుండా శరీరం నిర్మాణం కూడా గట్టిపడుతుంది. అయితే కాల్షియం ఒంట పట్టాలంటే విటామిన్ డి కచ్చితంగా కావాల్సిందే. అయితే చాలా మందిలో విటామిన్ డి లోపం ఉంటుంది. విటామిన్ డి తగినంతగా లేకపోతే తీసుకున్న కాల్షియం ఒంట పట్టకుండా మల విసర్జన ద్వారా బయటకు వెళ్లి పోతుంది.

అప్పుడు కాల్షియం నిండుగా ఉండే పదార్థాలు ఎన్ని తిన్నా మీకు ఉపయోగం ఉండదు. అందుకే కాల్షియంతో పాటు విటామిన్ డి ఉండే ఆహార పధార్థాలను తీసుకోండి.100 గ్రాముల గేదె పాలలో 120 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. కానీ మనకు మార్కెట్లో దొరికే పాలలో ఎక్కువగా నీళ్లు కలుపుతారు. అప్పుడు ఒక గ్లాసు గేదె పాలకు చిక్కటి గ్లాసు ఆవుపాలు సమానంగా ఉంటాయి. కాబట్టి మీరు ఒకరోజుకు సరిపోయే కాల్షియం కోసం ఉదయం, సాయంత్రం చొప్పున ఒక గ్లాసు పాలు తాగాలి. ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పాలు తాగలేని వారు ఆకు కూరల ద్వారా కూడా కాల్షియాన్ని పొందవ్చచు.

Health Benefits full calcium provide food items for all the people

Health Benefits full calcium provide food items for all the people

100 గ్రాముల తోటకూరలో 397 మిల్లీ గ్రాములు, 100 గ్రాముల మునగాకులో 440 మిల్లీ గ్రాములు, 100 గ్రాముల పాలకూరలో 510 మిల్లీ గ్రాముల కాల్షియం, 100 గ్రాముల కరివేపాకులో 730 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. అలాగే పొన్నగంటి కూరలో కూడా విపరీతమై కాల్షియం ఉంటుంది. ఇవే కాకుండా ఒక చిన్న పాటి నువ్వుల ఉండలో 450 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. రోజుకు 30 నుంచి 40 రూపాయలు ఖర్చు చేసి తాగే పాలకంటే ఆకు కూరలు, నువ్వుల ఉండలు తినడం వల్ల అధిక కాల్షియాన్ని సొంతం చేసుకోవచ్చు. అందుకనే మన పూర్వీకులు భోజనం తిన్న వెంటనే ఒఖ నువ్వుల ఉండ నోట్లో వేసుకుంటే శరీరానికి చాలా బలం వ్తుందని చెప్పేవారు. ఇప్పటికైనా పాలను తగ్గించి ఆకు కూరలు, నువ్వుల ఉండలు, పల్లిపట్టీ వంటి వాటిని తినండి. ఆరోగ్యంగా ఉండండి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది