Health Benefits : మీ లివర్ నిండు నూరేళ్లు రెస్ట్ లేకుండా పని చేయాలంటే.. ఈ నాలుగు అలవాట్లు మానుకోవాలి…!!
Health Benefits : మన శరీరంలో లివర్ సక్రమంగా పనిచేస్తేనే మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. మన శరీరంలో కీలకమైన పాత్ర పోషించేది లివర్. లివర్ లోని ఎన్నో ఎంజైములు తయారవుతూ ఉంటాయి. మనం తీసుకునే ఆహారం అరగడానికి ఈ ఎంజైములు సహాయపడతాయి. కావున శరీరంలో లివర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కావున లివర్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. లివర్ ఇబ్బంది పడేలా మనం ఆహారం అలవాట్లు ఉంచుకోకూడదు. మన జీవన శైలి లో కొన్ని మార్పుల కారణంగా లివర్ దెబ్బతింటుంది కావున ఆహారపు అలవాట్లలో కొన్ని అలవాట్లను మానుకోవాలి. దానివలన లివర్ని నిండు నూరేళ్లు కాపాడుకోవచ్చు.
*నూనెలో ఫ్రై చేసిన ఆహారం; నూనెలో వేయించినటువంటి వేపుళ్ళు, ఆలుగడ్డ చిప్స్, మిరపకాయ బజ్జీలు, సమోసాలు, మైసూర్ బోండా లాంటివి తీసుకోవడం వలన మీ లివర్ పై ఎక్కువ శ్రమ పడుతూ ఉంటుంది. దాని ఫలితంగా మీ కాలేయం ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశం ఉంటుంది. కావున అధికంగా ఆయిల్లో ఫ్రై చేసిన ఆహారాలను తీసుకోవద్దు.. *కూల్ డ్రింకులు తాగడం; మీ లివర్ ని దెబ్బతీసే అతిపెద్ద పొరపాటు కూల్ డ్రింకులు తీసుకోవడం వీటిలో అత్యధిక చక్కెర శాతం ఉంటుంది. కావున మీ లివర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కూల్డ్రింకులకు దూరంగా ఉండటం మంచిది.
*అధిక మాంసాహారం తీసుకోవడం; మాంసాహారంలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అయితే అదే పనిగా మాంసాహారం తీసుకోవడం వలన కాలేయంపై పని ఒత్తిడి పెరుగుతుంది. ఆ క్రమంలో లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కావున మాంసాహారం తినే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. *ఆల్కహాల్ తీసుకోవడం; లివర్ని తూట్లు పొడిచే అత్యంత ప్రమాదకరమైన అలవాటు మద్యపానం. ఈ మధ్యపానం అనేది లివర్పై పని ఒత్తిడి పెరుగుతుంది. మీరు ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నట్లయితే లివర్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. దాని ఫలితంగా లివర్ ఇన్ఫెక్షన్ కి గురయ్యే అవకాశం ఉంటుంది. లివర్ ఫెయిల్యూర్ అయ్యే మీ ప్రాణాలకి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆల్కహాలను తప్పకుండా మానుకోవాలి.