Health Benefits : ఈ పండు తింటే డాక్టర్ కూడా అవసరం లేదు.. అయితే ఆ టైమ్ లో తీసుకుంటేనే మంచిది
Health Benefits : సాధారణంగా ప్రతిరోజు ఒక యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే అంటుంటారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పండ్లు తీసుకెళ్లే వారు ఎవరైనా సరే మొదటగా యాపిల్స్‌కే ప్రాధాన్యతను ఇస్తుంటారు. యాపిల్ పండ్లలో నిజంగానే ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా యాపిల్ పండ్లలో గుండెకు మేలు చేసే అంశాలు మరిన్ని ఉన్నాయి.నిత్యం మనం పాటించే ఆహారపు అలవాట్లు, అస్తవ్యవస్తమైన జీవనశైలి తదితర కారణాల వల్ల అనేక మందికి జీర్ణ సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు ఇతర అనారోగ్యాలకు కూడా కారణమవుతున్నాయి. దీంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది.
అయితే జీర్ణ సమస్యలను పరిష్కరించుకుంటే దాదాపుగా ఇతర అనారోగ్యాలు కూడా రాకుండా చూసుకోవచ్చు. అందుకు గాను యాపిల్ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. నిత్యం యాపిల్ పండ్లను తింటే వాటిలో ఉండే పీచు పదార్థం జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది. మలబద్దకం సమస్యను నివారిస్తుంది.యాపిల్ పండ్లు మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి మన ఆకలి తీర్చడమే కాదు.. మరోవైపు మన శరీరానికి కావల్సిన పోషకాలను కూడా అందిస్తాయి. అధిక బరువు తగ్గేందుకు, గుండె ఆరోగ్యానికి యాపిల్స్ మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం, ఫోలేట్, బీటా కెరోటీన్, విటమిన్ కే తదితర పోషకాలు మన శరీరానికి సంపూర్ణ పోషణను అందిస్తాయి.

Health Benefits in Apples
Health Benefits : పోషకాలు మెండు..
ఆపిల్ పండ్ల వల్ల జీర్ణసమస్యలు కూడా తగ్గిపోతాయి.యాపిల్ పండ్లలో ఫ్లేవనాయిడ్లు, పీచు అధికంగా ఉంటాయి. యాపిల్ పండ్లను తొక్కతీయకుండానే తినాలి. ఇలా పరిగడుపున తింతే వాపులు తగ్గిపోతాయి. పాలిఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉండి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల యాపిల్ పండ్లు గుండె ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి.వివిధ వ్యాధులతో పోరాడటానికి శరీరం రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం చాలా అవసరం. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక యాపిల్ తినడం వల్ల మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు. యాపిల్స్‌లోని విటమిన్ సి, ప్రొటీన్, ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే బరువు కూడా తగ్గించుకోవచ్చు. యాపిల్ పండులో పీచు పదర్థాలు ఈధికంగా ఉంటాయి. దీని వల్ల ఎక్కువగా ఆకలి వేయదు.