Health Benefits : వీటిని తీసుకుంటే కీళ్ల నొప్పులు, మధుమేహం, రక్తపోటు మళ్లీ అస్సలే రావు..!
Health Benefits : వయస్సు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు ఒకటొక్కటిగా వచ్చి మీద పడతాయి. వయస్సు 30 దాటగానే మొకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము పట్టుకుందని చాలా మంది అనడం మనం వింటూనే ఉంటాం. కొంత మందిలో ఈ లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది. కూర్చుంటే పైకి లేవరాదు. కొద్ది దూరం నడవమన్నా.. శరీరం సహకరించదు. మెట్లు ఎక్కి దిగడం అంచే సాహసక్రీడగా చూసే వాళ్లు చాలా మందే ఉంటారు. ఇంట్లో పని కూడా చేసుకోలేనంతగా బాధ పెడతాయి సమస్యలు. ఇలాంటి వాటిపై చాలా మంది ఫిర్యాదు చేస్తుండటం వినే ఉంటాం. నిజానికి ఇది చిన్న సమస్యలా కనిపించినా మానసిక వ్యాకులత ఎక్కువ చేస్తుంది. దీనివల్ల బిపి, షుగర్-లాంటి సమస్యలు కూడా పెరుగుతాయి.
ఈ సమస్యలకు వంటింట్లో సులభంగా అందుబాటులో ఉండే మూడు పదార్ధాలతో గ్రీన్ టీ లాంటి డ్రింక్ ఒకటి తయారు చేసుకుని తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. గిన్నెలో ఒక గ్లాసు అంటే 250ml నీరు వేసుకొని, నీళ్లలో ఒక స్పూన్ ధనియా,-ఒక స్పూన్ సోంపు గింజలు-అర స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి వాటి పరిమళం వచ్చేదాకా బాగా మరిగించుకోండి. తర్వాత స్టయినర్-తో ఫిల్టర్ చేసి అలానే తాగవచ్చు లేదా రుచి కోసం తేనె మరియు నిమ్మ రసం కూడా కలిపి తీసుకోవచ్చు. కానీ షుగర్ ఉన్న వారు తేనె వేసుకొరాదు. ఖాళీ కడుపున త్రాగటం మంచిది. పొద్దున్న కుదరలేని వారు సాయంత్రం కూడా తాగవచ్చు. కాఫీ, టీ లాగే ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.ఇందులో వేసిన ధనియా, సొంపు, జిలకర వల్ల కలిగే ఉపయోగాలు. శరీరంలోని టాక్సిన్స్ బయట వెయ్యడానికి సహాయపడుతుంది.
ధనియా మరియు జీలకర్ర జీర్ణశక్తిని పెంచుతుంది. ధనియాలకు చల్లబరిచే గుణం ఉండటంవల్ల శరీరంలోని అధిక స్థాయి ఆసిడ్స్-లను తోలగిస్తుంది. ధనియా జీలకర్ర కాంబినేషన్ అతి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. దేహాన్ని హైడ్రేట్ చేసి చర్మంలో కాంతిని ఇస్తుంది. జలుబు, ముక్కు దిబ్బడ లాంటి సమస్యకు పరిష్కారం. జలుబు కోసం ఈ టీ తాగెప్పుడు నిమ్మ రసం వెయ్యరాదు. సామాన్యంగా సోంపు గింజలను మధ్యాహ్నం భోజనం తర్వాత ఒకిన్ని నోట్లో వేసుకోవటం దాదాపు అందరికీ అలవాటు. ఇలాంటి టీలో వాడటం వల్ల మంచి పరిమళాన్ని ఇస్తుంది.క్రమంతప్పకుండా టీ తాగటం వల్ల నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించి స్ట్రెస్ నుంచి విముక్తి ఇస్తుంది. మన శరీరంలోని టాక్సిన్స్ అన్నిటిని బయట పంపటం వల్ల యాంటీ క్యాన్సర్ గుణాలు ఎక్కువ అవుతాయి. ఇలాంటి ఎన్నో ఉపయోగాలు కలిగియున్న ఈ రెమిడీ ప్రతి ఒక్కరికి సహాయపడుతుంది.