Health Benefits : మీరు రక్తహీనతతో బాధపడుతున్నారా.. అయితే 15 రోజులు ఈ పొడిని వాడి చూడండి..
Health Benefits : ప్రస్తుతం మన ఉన్న కాలంలో ఎన్నో వ్యాధులు మనకు చుట్టుముడుతున్నాయి. అందులో ముఖ్యంగా రక్తం తక్కువగా ఉండడం ఈ సమస్య ఎక్కువగా ఆడవారిలో బయటపడుతుంది. మన శరీరంలో రక్తం అన్ని అవయవాలకు సరిపడినంతగా సరఫరా అవ్వకపోతే మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇలా రక్తం తక్కువగా ఉండటం అనే సమస్య ఎక్కువగా ఆడవారిలో వస్తుంది ఆడవారిలో ప్రసవం ద్వారా ఎంతో రక్తహీనత జరుగుతుంది తరువాత పిల్లలకు పాలు పట్టడం వలన కూడా చాలా రక్తహీనత కలుగుతుంది. ఇలా రక్తం తక్కువగా ఉన్నవాళ్లు ఇంగ్లీష్ మందులు ఎక్కువగా వాడుతూ ఉంటారు అలా వాడడం వలన మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి.
ఇలా ఇంగ్లీష్ మందులు వాడకుండా న్యాచురల్ గా ఈ పొడి తో రక్తహీనతను తగ్గించుకుందాం. తక్కువ డబ్బుతో ఈ సమస్య బారి నుంచి తప్పించుకోవచ్చు ఈ సమస్యనుంచి బయటపడటానికి ఈ గోధుమ గడ్డి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ గోధుమ గడ్డి ని మన పెరట్లోనే సాకవచ్చు అది ఎలా పెంచాలో చూద్దాం. గోధుమలను తెచ్చి వాటిని నైట్ మొత్తం నానబెట్టుకుని మరునాడు ఒక పూల కుండి తెచ్చుకొని దానిలో సరిపడా ఇసుక పోసి ఈ నానబెట్టిన గోధుమలను చల్లి దాని పైన కొంచెం ఇసుక చల్లాలి. తర్వాత రోజు కొంచెం నీరు ని పైన చల్లుతూ ఉండాలి అంతే మూడు నాలుగు రోజుల్లోనే గడ్డి పెరుగుతుంది. ఈ గడ్డిని కట్ చేసుకుని నీడలో రెండు మూడు రోజులు ఆరబెట్టి తర్వాత పొడి చేసుకోవాలి.
ఈ పొడిని మనం ప్రతిరోజు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ వేసుకుని కలుపుకొని 15 రోజులు త్రాగాలి లేదా గోధుమ గడ్డి కట్ చేసి పచ్చిగా ఉన్నప్పుడు దాన్ని జ్యూస్ లాగా చేసుకుని దానిలో కొంచెం నిమ్మరసం కలుపుకొని త్రాగవచ్చు. ఇలా పదిహేను రోజులు త్రాగడం వల్ల 100% ఖచ్చితంగా రక్తం పెరుగుతుంది. ఈ గోధుమ గడ్డి లో అయోడిన్ ,సెలీనియం, ఐరన్, మెగ్నీషియం లాంటి పోషకాలు ఎన్నో ఉంటాయి ఈ గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల గ్యాస్ ,అలర్జీలు, మలబద్ధకం, కంటి సమస్యలు, మతిమరుపు ,నీరసము ,ఒత్తిడి ఇలాంటి ఎన్నో సమస్యలు తగ్గుతాయి. ఇలాంటి గోధుమ గడ్డిని పెంచుకొని ఇలా వాడుకుందాం ఈ గడ్డి పెంచుకో లేని వారు గోధుమ గడ్డి పొడి మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఎక్కువగా ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. అయితే దీనికంటే మనం న్యాచురల్ గా ఇంట్లో పెంచుకునే గడ్డి తోనే మంచి లాభాలు ఉంటాయి.