Health Benefits : జీరా, నిమ్మ‌ర‌సంతో అధిక బ‌రువుకి చెక్.. ఇలా ట్రై చేస్తే న‌మ్మ‌లేని ఫ‌లితం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : జీరా, నిమ్మ‌ర‌సంతో అధిక బ‌రువుకి చెక్.. ఇలా ట్రై చేస్తే న‌మ్మ‌లేని ఫ‌లితం

 Authored By mallesh | The Telugu News | Updated on :24 March 2022,1:00 pm

Health Benefits : అధిక‌ బరువు ఇది ఈ రోజుల్లో చాలామందికి ఉన్నసర్వ సాధారణ సమస్య. ఆ సమస్య నుండి బయట పడేందుకు రకరకాల పద్ధతులు పాటిస్తారు. అవేంటో ఇప్పుడు తెల‌సుకుందాం. సాధార‌ణంగా జిల‌క‌ర్ర ప్ర‌తి వంటకానికి పోపుతోపాటు వాడతారు. అలాగే.. ఘుమఘుమల సువాసన కోసం వాడతారు. అయితే అద్భుమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన జీరాలో వెయిట్ లాస్ తగ్గించే పవర్ దాగి ఉంది. బెల్లీ ఫ్యాట్ ని 20 రోజులలోపే తగ్గించుకోవడానికి జీరా చక్కటి పరిష్కారం. బెల్లీ ఫ్యాట్ మాత్రమే కాదు.. శరీర బరువు మొత్తం ఈజీగా తగ్గిపోతుంది. ఈజీగా క్యాలరీలు కరిగించడానికి, మెటబాలిజం పెంచడానికి, జీర్ణక్రియ రేట్ సజావుగా ఉండటానికి జీరా సహాయపడుతుంది.

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. హార్ట్ ఎటాక్ ని అరికడుతుంది. మెమరీ పవర్ ని పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అనీమియాతో పోరాడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ పెట్టే సత్తా కూడా జీరాలో ఉంది.శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించే ఔషధ గుణాలు నిమ్మ‌ర‌సంలో ఉన్నాయి. దీంతో అధిక బ‌రువు ఉన్న‌వారు నిమ్మర‌సం తాగితే మంచి ఫ‌లితం ఉంటుంది. అంతేకాదు ఇలా తాగ‌డం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగవుతుంది. కేవలం బరువు తగ్గడమే కాదు.. గుండె సంబంధ స‌మ‌స్యల‌ను కూడా దూరం చేస్తుంది.

Health Benefits in Check for excess weight with cumin lemon juice

Health Benefits in Check for excess weight with cumin lemon juice

Health Benefits : బాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్..

డయాబెటిస్ ఉన్నవాళ్లు నిమ్మర‌సం తాగితే, ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి.అయితే ఒక గ్లాసున్న‌ర నీళ్లు తీసుకుని మ‌రిగించాలి. ఇందులో లెమ‌న్ తీసిన నిమ్మ తొక్క‌లు ముక్క‌లుగా కోసి వేయాలి. ఇలా బాగా మ‌రిగించి చ‌ల్లారిన త‌ర్వాత ఫిల్ట‌ర్ చేసి స్పూన్ తేని వేసి క‌లుపుకుని ఉద‌యాన్నే ప‌రిగ‌డుపున తాగాలి. లేదా సాయంత్ర తినేకంటే అర‌గంట ముందుగాని లేదా తిన్న‌అర‌గంట త‌ర్వాత తాగాలి. ఇలా చేస్తే జీర్ణ‌క్రియ మెరుగుప‌డి బాడ్ కొలెస్ట్రాల్ పెర‌గ‌కుండా చేస్తుంది. అలాగే జీరా, నిమ్మ‌ర‌సం క‌లుపుకొని తాగినా అధిక బ‌రువును నియంత్రించ‌వ‌చ్చు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది