Health Benefits : ఇలా చేయ‌డం వ‌ల్లే పులిపిర్లు వ‌స్తాయ‌ట‌.. అందుకే ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : ఇలా చేయ‌డం వ‌ల్లే పులిపిర్లు వ‌స్తాయ‌ట‌.. అందుకే ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి

 Authored By mallesh | The Telugu News | Updated on :5 April 2022,5:00 pm

Health Benefits : పులిపిరి కాయల సమస్య చాలా మందిలో చూసే ఉంటాం. ఇంగ్లీష్‌లో వీటిని వార్ట్స్ అంటారు. హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ వల్ల ఈ పులిపిరులు ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా ముఖం, మెడ, చేతులు, పాదాలపై వస్తుంటాయి. చర్మంలో కలిసిపోయే కొన్ని పులిపిర్లు పెద్దగా నొప్పిరావు. కానీ, కొన్ని దురద పుడుతుంటాయి.అయితే వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో రోగనిరోధక శక్తి లోపించినప్పుడు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు కొన్ని రకాల వైరస్‌లు శరీరంపై దాడి చేస్తాయి. ఈ నేపథ్యంలో కొందరికి పులిపిర్లు ఏర్పడతాయి. పులిపిర్లను కత్తిరించటం, కాల్చటం వంటివి చేయకూడదు. కొన్ని స‌హ‌జ చిట్కాల‌ను పాటించి పులిపిర్ల‌ను ఎలా న‌యం చేయ‌వ‌చ్చో ఇప్పుడు చూద్దా..

చర్మ వ్యాధుల నివారణకు వెల్లులి చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. ఇందులో ఉండే ఎల్లిసిన్.. ఫంగస్, వైరస్ వంటి బ్యాక్టీరియాలతో పోరాడుతుంది. అలాగే పులిపిర్లను తొలగించడంలోనూ ఇది అత్యుత్తమంగా పనిచేస్తుంది. వెల్లులిని ముద్దగా చేసుకుని పులిపిర్లు ఉన్నచోట రాస్తే చాలు క్ర‌మంగా త‌గ్గిపోతాయి. ఉల్లిపాయ‌ర‌సంలో ఉప్పు క‌లిపి పులిపిర్ల‌పై రాస్తే తొంద‌ర్లోనే రాలిపోతాయి.అరటి పండు తొక్కలో ఉండే ఎంజైమ్‌లు చర్మానికి మేలు చేస్తాయి. అరటి పండు తొక్కతో రోజు పులిపిర్లపై రుద్దితే త‌గ్గిపోతాయి. అలాగే వెనిగ‌ర్ లో నానా బెట్టిన ఉల్లిపాయ లేదా నారింజ తొక్క పులిపిర్లు ఉన్న చోట పెట్ట‌డం వ‌ల్ల రంగుమారి క్ర‌మేణా రాలిపోతాయి.

Health Benefits in home remedies for Skin tag removal

Health Benefits in home remedies for Skin tag removal

Health Benefits : స‌హ‌జ ప‌ద్ద‌తుల్లో..

కొబ్బ‌రి నూనేలో క‌ర్పూరం క‌లిపి రాసినా మంచి ఫ‌లితం ఉంటుంది.ఆముదంలో కాస్త బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపి పులిపిర్లపై రాసి బ్యాండేజ్ వేయాలి. అలా రాత్రంతా ఉంచి తీసెయ్యాలి. ఇలా రెండు నుంచి మూడు రోజులు చేసినట్లయితే పులిపిర్లు పూర్తిగా తొలగిపోతాయి.క‌ల‌బందలో ఉండే మేలిక్ యాసిడ్ పులిపిర్లలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కలబంద ఆకు మధ్యలో ఉండే జిగురును తీసుకుని పులిపిర్లపై రాస్తే రాలిపోతాయి. దూదిని యాపిల్ సిడర్ వెనిగర్‌లో ముంచి పులిపుర్లు ఉన్నచోట అద్దాలి. ఇలా వారంలో కనీసం ఐదు రోజులు చేస్తే పులిపిర్లు పూర్తిగా మాయమవుతాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది