Health Benefits : సమ్మర్ లో కాలే ఆకు తింటే ఫుల్ బాడీ డిటాక్సిఫై…. వెంటనే హీట్ మాయం
Health Benefits : కాలే అనేది బ్రోకలీ, కాలీఫ్లవర్, మరియు ఆవపిండి ఆకుకూరలు వంటి క్యాబేజీ కుటుంబానికి చెందిన పచ్చని ఆకు కూర. ఇతర ఆకు కూరల మాదిరిగా కాలే ఆకు శరీరానికి చాలా మంచిది. వివిధ విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉంది. ముడి కాలేలో 33 కేలరీలు, ప్రోటీన్ యొక్క 3 గ్రాములు, జీర్ణ ప్రక్రియ, విటమిన్ A, విటమిన్ సీ, ఫోలిక్ ఆమ్లం మరియు బీ విటమిన్లు, మెదడు అభివృద్ధి, ఆల్ఫా లినోలెనిక్ ఆమ్లం మరియు ఒమేగా కొవ్వు గుండె ఆరోగ్యం, లుటీన్, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మరియు జింక్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.కాలే దాని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలగి ఉంది. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో చాలా బాగా ఉపయోగపడతుంది. ఇది శక్తివంతమైన ఔషధ గుణాలు కలిగిన, ప్రపంచంలోని గొప్ప పోషక భరితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటి.
కాలే క్యాబేజీ కుటుంబానికి చెందిన కూరగాయలలో ఒకటి (బ్రసికాసియే). ఇది తక్కువ కొవ్వు పదార్ధాలను మరియు తక్కువ కాలరీలను కలిగి ఉండి, పోషకాలలో అధికంగా ఉంటూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడుకుని పోషకభరితమైన ఆహారంగా ఉంటుంది.ఈ కాలే ఫైబర్, విటమిన్ బీ6, విటమిన్ సీ మరియు పొటాషియంలలో సమృద్ధిగా ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యానికి దోహదపడే పోషకాలుగా ఉన్నాయి. మీరు కొవ్వు లేదా అధిక ప్రోటీన్ నిల్వలు కలిగిన భోజనాన్ని తీసుకున్నప్పుడల్లా, కాలేయం కొవ్వులను పైత్యరస ఆమ్లాలుగా మారుస్తుంది. క్రమంగా కొవ్వును సంగ్రహించడానికి జీర్ణాశయంలోకి పంపబడుతుంది. కాలేలో ఉండే పైత్య రసాలను క్రమబద్దీకరించే నిరోధకాలు, పైత్య ప్రకోపాల పెరుగుదలను గణనీయంగా తగ్గిస్తాయి,
మరియు కొవ్వులను తిరిగి శోషించుకోనివ్వకుండా నిరోధిస్తుంది.అలాగే కాలే ఆకులలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అందుకే సమ్మర్ లో ఈ ఆకు తినడం వల్ల బాడీ డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. కాలే ఆకులోని ఫైబర్ ప్రేగుల కదలికలలో అత్యుత్తమంగా సహాయపడుతుంది. క్రమంగా జీర్ణ శక్తిని ప్రోత్సహించడం ద్వారా మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను సైతం పరిష్కరిస్తుంది. కాలేలో ఉండే ప్రోటీన్ మరియు ఫైబర్ నిల్వలు మీకు కడుపు నిండిన అనుభూతికి లోను చేయడం ద్వారా అవాంఛిత ఆహార కోరికలను నిరోధించగలుగుతుంది.అలాగే డీఎన్ఏ డ్యామేజ్ అవకుండా కాలే ఆకు అద్బుత ఔషదంగా పనిచేస్తుంది. శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది. అందుకు సమ్మర్ లో ఏ ఆకు కూర తిన్నా తినకపోయినా కాలే ఆకు కూర కచ్చితంగా తినడం అలవాటు చేసుకోవాలే.