Health Benefits : నడుం నొప్పి, కీళ్ల నొప్పులను ఖతం చేసే వంటింటి పదార్థం ఏంటో తెలుసా?
Health Benefits : ప్రస్తుత కాలంలో మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, వాతం నొప్పులతో చాలా మంది బాధ పడుతున్నారు. ఏళ్లు కూడా నిండక ముందే వృద్ధాప్య దశకు చేరుకుంటున్నారు. అయిచే మన శరీరంలో కల్గే కండరాలు, జాయింట్ పెయిన్స్ వల్ల… పెయిన్ కిల్లర్ మాత్రలు వాడటం అలవాటు అయిపోయింది. అయితే వీటి వల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. సహజమైన పద్ధతుల్లో పెయిన్ తగ్గించుకుంటే కొంచెం అయినా ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్లం అవుతాం. అయితే చాలా మంది ఇళ్లల్లో వాడే రాళ్ల ఉప్పు లేదా సైంధవ లవణాన్ని వాడి శరీరంలో వచ్చే అనేక రకాల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఉప్పు మనిషి యొక్క అత్యుత్తమ ఆవిష్కరణ అని చెప్పవచ్చు. ఎందుకంటే రుచి మొగ్గలను సంతృప్తి పరచడాని, ఆహార రుచిని మరింత పెంచడానికి ఉప్పు చాలా ఉపయోగపడుతుంది. కాస్తంత ఉప్పు తగ్గినా మనం ఆ పదార్థాన్ని తినలేం. అయితే ఈ మధ్య అందరూ సన్న ఉప్పునే వాడుతున్నారు. కానీ దాన్ని స్టో పాయిజన్ గా పరిగణిస్తుంటారు. అంతే కాకుండా ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటుతో పాటు చర్మ సమస్యలు వస్తుంటాయి. ఎన్నో రకాల సమస్యలకు సన్న ఉప్పు కారణమని చాలా మంది ఆలోచన. కానీ ఈ ఉప్పుకు ప్రత్యామ్నాయంగా సైంధవ లవణం లేదా రాళ్ల ఉప్పును వాడితే చాలా మంచిది. ఆయుర్వేదం ద్వారా సైంధవ లవణం లేదా రాళ్ల ఉప్పు చాలా మంచిదని చెప్పబడుతోంది.

Health Benefits in synthetic salt is the fastest way to get rid of body aches
ఇది ఉప్పు యొక్క స్వచ్ఛమైన రూపమని… దీన్ని ప్రాసెస్ చేయకముందే వాడడం వల్ల ఇందులో ఎలాంటి కెమికల్స్ కలిపే అవకాశం లేదనేది ఆయుర్వేద నిపుణుల మాట. అయితే ఈ సైంధవ లవణం లేదా రాళ్ల ఉప్పులో పొటాషియం, ఇనుము, కాల్షియం, జింక్, మెగ్నీషియం, రాగి వంటి వాటితో పాటు 84 రకాల ట్రేస్ ఎలిమెంట్స్, ఖనిజాలు ఉంటాయట. సముద్రం నుంచి నేరగా ఈ ఉప్పును తీస్తుంటారు. అయితే ఈ రాళ్ల ఉప్పును బాగా మరిగిన నీటిలో వేసి… శరీరం భరించగలిగేంత వేడి ఉన్నప్పుడు.. ఓ కాటన్ బట్టతో కాపడం పెట్టాలి. ఉలా చేయడం వల్ల నొప్పులు త్వరగా తగ్గిపోతాయట. అలాగే ఉప్పులో ఉండే ఎలక్ర్టోలైట్ ల వల్ల కండరాల తిమ్మరితో పాటు వాతం నొప్పులు కూడా మటుమాయం అవుతాయంట.