Health Benefits : కూర్చోకుండా, నిలబడకుండా చేసే పైల్స్ ను ఇలా తరిమికొట్టండిలా..!
Health Benefits : చాలా మంది పైల్స్ వ్యాధితో బాధ పడుతూ ఉంటారు. పైల్స్ వ్యాధి ఉండటం వల్ల కూర్చోలేరు. అలా అని ఎక్కువ సేపు నిలబడలేరు. కమోడ్ పైన కూర్చున్న సమయంలో పైల్స్ తో వచ్చే నొప్పిని తట్టుకోవడం చాలా కష్టం. ఆ కొద్ది సేపు నరకంలో ఉన్నట్లు అనిపిస్తుందని చాలా మంది పైల్స్ బాధితులు చెబుతుంటారు. అయితే.. మనం తీసుకునే ఆహారం, రోజూ ఎన్ని గంటలు కూర్చుని ఉన్నాం, జీర్ణ క్రియ వ్యవస్థ సరిగ్గా లేక మలబద్ధకం రావడం లాంటి అంశాలపై పైల్స్ రావడం ఆధారపడి ఉంటుంది. పైల్స్ వ్యాధి కొంత మందికి ఎన్ని మందులు వాడినా తగ్గదు. పైల్స్ వ్యాధితో బాధ పడేవారు వాష్‌రూములో ఉండలేరు.. బయటకి రాలేరు. ఈ బాధని ఎవరికీ చెప్పుకోలేక మానసిక వేదన అనుభవిస్తారు.
అలాంటి పైల్స్ వ్యాధిని ఈ చిన్న చిట్కాతో ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. బాగా పండిన అరటి పండు లేదా పచ్చి అరటి పండు కాకుండా మధ్యస్తంగా ఉన్న అరటి పండును తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చ కర్పూరం చిన్న ముక్క తీసుకుని అరటి పండు ముక్కలో పెట్టుకోవాలి. దీనిని ఉదయాన్నే పరగడుపున బాగా నమిలి తినాలి. ఇది తిన్న అరగంట ఏమి తాగకూడదు, తినకూడదు. అలా తినలేము అనుకున్న వాళ్ళు పచ్చ కర్పూరం పొడి చేసుకుని అరటి పండు ముక్కలపై జల్లుకుని తినేయాలి. అరటి పండు మొత్తం తినేయొచ్చు. ఇది రోజుకి ఒక్క సారి మాత్రమే తీసుకోవాలి. ఇలా వరుసగా మూడ్రోజులు తీసుకుంటే.. పైల్స్ పూర్తిగా తగ్గుతాయి. పైల్స్ ఎక్కువగా బాధిస్తున్న వారు 5 రోజుల పాటు తీసుకోవాలి. ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న పైల్స్ వ్యాధి ఈ ఒక్క చిట్కాతో ఈజీగా తగ్గిపోతుంది.
ఈ చిట్కా టై చేసినపుడు బయట ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఆయిల్ ఫుడ్స్ తినకూడదు. కూరలలో కూడా నూనె చాలా తక్కువగా వేసుకోవాలి. కారం కూడా చాలా తక్కువగా తినాలి. కారం, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం వలన పైల్స్ వ్యాధి తగ్గదు. పైల్స్ వ్యాధి పూర్తిగా తగ్గే వరకు కారం, మసాలాలు తినడం మానేయాలి. పైల్స్ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత తినొచ్చు. ఎన్నో సంవత్సరాల నుండి బాధపడుతున్న పైల్స్ వ్యాధిని తక్కువ ఖర్చుతో, ఈజీగా ఇంట్లోనే ఈ ఒక్క చిట్కాతో పూర్తిగా తగ్గించుకోవచ్చు. పైల్స్ వ్యాధి ఉన్నవారు నీళ్లు ఎక్కువగా తాగాలి. నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే అంత త్వరగా నయం అవుతుందని డాక్టర్లు చెబుతారు.