Health Benefits : దీన్ని త్రాగారంటే పేగులో కదలికలు వచ్చి… ఫ్రీ మోషన్ అవుతుంది…
Health Benefits : బార్లీ గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి నేచురల్ డయూరేటిక్ లాగా బాగా పనిచేస్తుంది. దీని ద్వారా స్వెల్లింగ్, కాళ్ల వాపులు తగ్గడమే కాకుండా గాల్ బ్లాడర్ లో రాళ్లను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఇలా ఉపయోగపడుతుందని మన ఇండియాలోనే పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు నిరూపించారు. 100 గ్రాముల బార్లీ గింజలు తీసుకుంటే అందులో 354 కిలోల క్యాలరీల శక్తి, ప్రోటీన్ 12.5 గ్రామ్స్, ఫ్యాట్ 2.3g, కార్బోహైడ్రేట్స్ 73.5 గ్రామ్స్, ఫైబర్ 17 గ్రామ్స్, పాస్పరస్ 254 మిల్లీ గ్రాములు, 452 మిల్లీగ్రామ్ ల పొటాషియం, 37.7 మైక్రోగ్రామ్స్ ఇవన్నీ బార్లీలో ఉండే పోషకాలు.
బార్లీ గింజల్లో ఉండే ప్రోటీన్, ఫైబర్ వలన పేగులకు వెళ్ళిన ఫ్యాట్ ఎక్కువ రక్తంలోకి లివర్ లోకి పోకుండా రక్షించడానికి బాగా సహాయపడుతుంది. సాధారణంగా కొలెస్ట్రాల్ వలన గాల్ స్టోన్స్ వస్తుంటాయి. కొలెస్ట్రాలను తగ్గించడానికి ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్ ఉపయోగపడుతుంది. మనం తినే ఆహారంలో కొవ్వులు ఉంటాయి. చిన్న పేగుల్లో మొదటి భాగాన్ని డియోనియం అంటారు. ఇక్కడ కొవ్వును ఆరిగించడానికి ఒక జ్యూస్ కావాలి. దాని పైత్యరసం అంటారు. ఇది గాల్బ్లాడర్లో నిలువ చేసుకొని ఉంచుతుంది.
ఈ గాల్ బ్లాడర్ లో నిల్వ ఉన్న పైత్యరసం ఎంత కావాలో చిన్న పేగుల్లో ఉండే ఒక ఎంజైమ్ సహాయపడుతుంది. తక్కువ ఉత్పత్తి అయితే గాల్బ్లాడర్లో ఉండే జ్యూస్ తక్కువ ఉత్పత్తి అవుతుంది. అందువలన గాల్బ్లాడర్లో ఎక్కువ పైత్యరసం ఉంటుంది. ఇందులో కొవ్వులు ఎక్కువగా ఉండడం వలన అవి స్టోన్స్ లాగా ఏర్పడతాయి. బార్లీ తీసుకోవడం వలన సిసికే ఎంజైమ్ ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీనివలన గాల్ బార్డర్లో స్టోన్స్ ఏర్పడడం తగ్గుతుంది. కాబట్టి ప్రతిరోజు బార్లీని తినడం మంచిది. దీనిలో ఉండే ఫైబర్ వలన మోషన్ ఫ్రీగా అవుతుంది మలబద్ధకం రాకుండా సహాయపడుతుంది.