Health Benefits : ఈ మూడింటిని కలిపి జ్యూస్ చేసి తాగారంటే.. అసిడిటీ, తిమ్మిర్లు క్షణాల్లో మటుమాయం!
Health Benefits : ఈ మధ్య కాలంలో చాలా మంది తరచుగా అసిడిటీతో బాధపడుతున్నారు. దాన్ని తగ్గించుకునేందుకు, ఉపశమనం పొందొందేకు ఎంతగానో కష్టపడుతుంటారు. ఏవేవో తాగుతూ.. తింటూ అసిడిటీని తగ్గించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతుంటారు. భోజనం ఎక్కువగా తీసుకోవడం లేదా తిన్న వెంటనే పడుకోవడం వల్ల ఈ అసిడిటీ వస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ సమస్య నుండి ఉపశమనం పొందేందుకు సమహజమైన మార్గం ఉందియ ఈ జ్యూస్ ని మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక్క గ్లాస్ తాగారంటే చాలు ఎసిడిటీకి మూల కారణం అయిన యాసిడ్ రిఫ్లక్స్ నాశనం అవుతుంది. నిమిషాల వ్యవధిలోనే అసిడిటీ నుంచి ఉపశమనం పొందచ్చని వివరిస్తున్నారు. అయితే ఆ జ్యూస్ ఏంటి ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మనం ఇంట్లోని పోపుల డబ్బాలో ఉండే బిర్యానీ ఆకులతో అసిడిటీని తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాదు ఎన్నో వంటకాల్లో వాడే ఈ బిర్యానీ ఆకుల వల్ల మోకాళ్ల నొప్పులు, నరాల వీక్ నెస్ ను తగ్గించుకోవచ్చట. అలాగే మనకు వచ్చే తిమ్మిర్లను కూడా ఇది తగ్గిస్తుందట. అయితే ఇన్ని ప్రయోజనాలను చేకూర్చే ఈ ఆకుకు అర చెంచా వాము, అర చెంచా సోంపు గింజలు కలిపి.. వీటన్నిటిని ఒక గ్లాసుడు నీళ్లతో పాటు మరిగించాలట. అలా తయారు చేసుకున్న కషాయాన్ని తాగటం వల్ల శరీరంలోని ఎన్నో సమస్యలు దూరం అవుతాయట. దీనిని నేరుగా తాగలేని వారు ఒక చెంచా తేనె కలుపుకొని తాగాలి. మధుమేహం ఉన్న వారైతే… నేరుగానే తాగాల్సి ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం లేదా సాయంత్రం ఇది తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు, తిమ్మిర్లు, అసిడిటీ, గుండె సంబంధిత సమస్యలు తొలగిపోతాయట.
అయితే సోంపు గింజల వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందట. మనం ఏం తిన్నా వెంటనే అరిగిపోతుందట. సోంపు గింజల్లో ఉండే ఫైబర్ వల్ల మన శరీర బరువు తగ్గుతుందట. అలాగే వాము గింజల వల్ల మన శరీరంలోని పలు రసాయనాలను విడుదల చేసేలా చేస్తుందట. ఇి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయ పడుతుందట. వాము గింజలు వేసి మరిగించిన నీటిని తాగడం వల్ల అజీర్తి, వికారం వంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయనే విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే… నెల రోజుల్లోనే కిలో నుంచి రెండు కిలోల బరువు తగ్గొచ్చు. ఇంకా బిర్యానీ ఆకులు, సోంపు గింజలు, వాము… ఈ మూడింటిని కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చు. అజీర్తి, వికారం, మోకాళ్ల నొప్పులు, తిమ్మిర్లు, నరాల వీక్ నెస్, గుండె సంబంధిత వ్యాధులు, అధిక బరువును నివారించవచ్చు.