Health Benefits : ఒబేసిటీ తో బాధపడుతున్నారా! అయితే ఇలా చేసి సింపుల్ గా ఒబేసిటీని తగ్గించుకోండి..
Health Benefits : ప్రస్తుతం ఉన్న కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది అధిక బరువు పెరిగి పోతున్నారు. ఇలా బరువు పెరగడానికి కారణాలు ఏంటి . టైం టూ టైం తినకపోవడం. ఎక్కువగా బయట ఫుడ్ తీసుకోవడం. ఎక్కువ ఆయిల్ ఫుడ్ ను తీసుకోవడం. రాత్రి లేట్ గా భోజనం చేయడం. చేసిన వెంటనే పడుకోవడం. ఇలాంటివన్నీ బరువు పెరగడానికి గల కారణాలు ఒక మనిషి సగటు బరువు 40 నుంచి 45 కంటే ఎక్కువ ఉండకూడదు. ఇలా అధిక బరువు ఉండడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అధిక బరువు ఉండటం వలన మోకాళ్ళ నొప్పులు వస్తాయి.
ఎందుకు అంటే మన శరీర బరువు మొత్తం కాళ్ళ పైనే పడుతుంది. దానివల్ల మోకాళ్ళ లో గుజ్జు అరిగిపోతుంది. అందుకే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అదే విధంగా గుండె జబ్బులు కూడా వస్తాయి. ఇలా ఎన్నో రకాల జబ్బులకు కారణమవుతుంది .ఈ అధిక బరువును తగ్గించుకోవడానికి ఎన్నో ఇంగ్లీష్ మందులను వాడుతూ ఉంటారు. మందులు వాడడం వలన ఒబేసిటీ తగ్గదు. మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అధిక బరువు తగ్గాలి అంటే మన చేతిలోనే ఉంటుంది. మన నోటికి అప్పుడప్పుడు తాళం వేయాలి. బరువు తగ్గాలి అంటే ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిని ఒక లీటర్ త్రాగాలి. వెంటనే మలవిసర్జన కు వెళ్లాలి. గంట తర్వాత కొంత సమయం వాకింగ్ చేయాలి.
ఆ తరువాత అల్పాహారంలో మొలకలను , కీరదోస ముక్కలను ఒకప్పుడు తీసుకోవాలి. ఒక గంట తర్వాత క్యారెట్ ,బీట్రూట్ ,ఒక టమాటా ,కొత్తిమీర , పుదీనా వీటన్నిటిని కలిపి జ్యూస్ చేసుకొని త్రాగాలి. మధ్యాహ్నం భోజనంలో అన్నం తక్కువ కూర ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలను ఎక్కువగా వాడుతూ ఉండాలి. అన్నం తిన్న ఒక గంట వరకు నీటిని త్రాగవద్దు. ఇక సాయంకాలం భోజనం చేయవద్దు. సాయంకాలం సమయంలో పండ్లను మాత్రమే తీసుకోవాలి. ఏడు గంటల సమయం లోపే పండ్లను తీసుకోవాలి. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మాత్రమే వ్యాయామాలు చేయాలి. ఈ నియమాలను పాటించడం వలన 100% అధిక బరువును తగ్గించుకోవచ్చు.