Beetroot : బీట్ రూట్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు… ముఖ్యంగా ఆడవారికి…!
ప్రధానాంశాలు:
Beetroot : బీట్ రూట్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు... ముఖ్యంగా ఆడవారికి...!
Beetroot : సహజమైన పోషకాలతో నిండిన బీట్ రూట్ వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి. బీట్ రూట్ Beetroot నీ జ్యూస్ రూపంలో తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే బీట్ రూట్ తీసుకోవడం వలన రక్తహీనత వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇక బీట్ రూట్ లో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్లు, ఎలక్ట్రోలైట్ మరెన్నో ఇతర పోషకాలు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా కాలుష్యం ఫైబర్, ఐరన్ , పొటాషియం ,విటమిన్ బి 6 మరియు సి వంటి పోషకాలు బీట్ రూట్ లో పుష్కలంగా లభిస్తాయి. బీట్ రూట్ ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
ముఖ్యంగా ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడుతున్న వారు బీట్ రూట్ వంటి పోషకాహారాలను తీసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా కీళ్ల నొప్పుల సమస్యలకు 33% బీట్ రూట్ దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మహిళలు ప్రతిరోజు బీట్ రూట్ ని తినడం చాలా అవసరమట. ఇక బీట్ రూట్లో ఉండే ఫొలేట్ విటమిన్ బి ఉండడం వలన గర్భిణీ స్త్రీలకు ఇది ఎంతో మేలు చేస్తుంది.
బెల్లీ ఫ్యాట్ అధిక బరువుతో బాధపడుతున్న వారు ఈ బీట్ రూట్ జ్యూస్ ని తాగడం వలన వేగంగా బరువు తగ్గడంతో పాటు రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తపోటును తగ్గించే నైట్రేట్ పోషకం బీట్ రూట్ లో సమృద్ధిగా ఉంటుంది. బీట్ రూట్ జ్యూస్ తాగడం వలన హైపర్ టెన్షన్ వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. బీట్ రూట్ లో పొటాషియం అధికంగా ఉండడం వలన కండరల మరియు నరాల సమస్యలను తగ్గిస్తుంది. లివర్ పై కొవ్వు పేరుకుపోకుండా బీట్ రూట్ జ్యూస్ సహాయపడుతుంది.
చర్మ రక్షణలో కూడా బీట్ రూట్ ఎంతో సహాయపడుతుంది. ఇందులో ఉండేటువంటి బ్యాక్టీరియా యాంటీ ఆక్సిడెంట్లు, హానికరమైన బ్యాక్టీరియాల నుంచి రక్షించడంలో దోహదపడుతుంది. ప్రతిరోజు బీట్ రూట్ తినడం వలన గుండె జబ్బుల ప్రమాదం నుండి బయటపడవచ్చు. అదేవిధంగా క్యాన్సర్ కారక కణాలను బీట్రూట్ లోని వర్ణ ద్రవ్యం నిరోధిస్తుంది.