Betel Leaves : తమలపాకులో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Betel Leaves : తమలపాకులో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

 Authored By ramu | The Telugu News | Updated on :27 June 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Betel Leaves : తమలపాకులో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Betel Leaves : దక్షిణాదిలో చాలామంది ఇళ్లల్లో భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకునే ఆచారం ఒకటి ఉంటుంది. ప్రస్తుతం అది తగ్గి ఉండవచ్చు. కానీ ప్రతిరోజు ఆహారం తినగానే తమలపాకు తాంబూలం తినేవాళ్లు చాలామంది ఉన్నారు. ఆయుర్వేద ప్రకారం తమలపాకు ప్రాముఖ్యత నోటిని శుభ్రపరిచేందుకు మాత్రమే పరిమితం కాదు. ఇది ఎన్నో శారీరక సమస్యలను కూడా దూరం చేయగలదు. వేసవిలో చాలా మందికి ముక్కునుండి రక్తం అనేది వస్తూ ఉంటుంది. ఈ సమస్య నివారణకు తమలపాకు ఎంతో ప్రభావితంగా పని చేస్తుంది. తమలపాకు అనేది రక్తం తొందరగా గడ్డకట్టేలా చేస్తుంది. తమలపాకు బ్యాక్టీరియకు వ్యతిరేకంగా పోరాడుతుంది. కావున మొటిమలు మరియు దద్దుర్లు లాంటి చర్మ సమస్యలు కూడా దూరంగా ఉంచుతుంది.

ఆర్థరైటిస్ నొప్పులను నియంత్రించడంలో కూడా తమలపాకులు ఎంతో ప్రభావితంగా పనిచేస్తాయి. తమలపాకును ప్రతిరోజు తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు కూడా నయం అవుతాయి. అలాగే తమలపాకులు ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరంలో జీవక్రియ రేటు కూడా ఎంతగానో పెరుగుతుంది. అయితే జీవక్రియ రేటు పెరిగినప్పుడు బరువు తగ్గటం కూడా సులభం అవుతుంది.

Betel Leaves తమలపాకులో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

Betel Leaves : తమలపాకులో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

తమలపాకు పానీయం తీసుకోవడం వలన జలుబు నుండి తక్షణమే ఉపసమణం కలిగిస్తుంది. ఈ తమలపాకులను నీళ్లలో వేసి మరిగించి ఆ నీటిని తీసుకోవటం వలన జలుబు తో పోరాడి వెంటనే ఉపసమనాన్ని కలిగిస్తుంది. వీటితో పాటుగా తమలపాకు నీటిని తాగటం వలన కూడా జీర్ణక్రియ కు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ తమలపాకు నీటిని తీసుకోవటం వలన జీర్ణశక్తి కి కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే గ్యాస్ సమస్యలు తొలగిపోయి గుండె మంట లాంటి సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది