Health Benefits : తమలపాకుల్ని భోజనం తర్వాత తీసుకుంటున్నారా… అయితే తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : తమలపాకుల్ని భోజనం తర్వాత తీసుకుంటున్నారా… అయితే తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది…

Health Benefits : తమలపాకు అంటే దీనిని దేవుడికి పూజ సామాగ్రిగా వాడుతూ ఉంటారు. అలాగే కొన్ని శుభకార్యాలలో తాంబూలంగా ఇస్తుంటారు. అదేవిధంగా శుభకార్యాలలో భోజనం తర్వాత కిల్లిగా కూడా ఇస్తూ ఉంటారు. ఇలా ఎన్నో రకాలుగా ఈ తమలపాకుని వాడుతూ ఉంటారు. అలాగే దీనివలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. సహజంగా చాలామంది తమలపాకుని భోజనం చేసిన తర్వాత తింటూ ఉంటారు. అయితే ఇది మంచి అలవాటు కూడా. అలాగే భారతీయ మతపరమైన సాంప్రదాయాలలో […]

 Authored By aruna | The Telugu News | Updated on :8 September 2022,3:00 pm

Health Benefits : తమలపాకు అంటే దీనిని దేవుడికి పూజ సామాగ్రిగా వాడుతూ ఉంటారు. అలాగే కొన్ని శుభకార్యాలలో తాంబూలంగా ఇస్తుంటారు. అదేవిధంగా శుభకార్యాలలో భోజనం తర్వాత కిల్లిగా కూడా ఇస్తూ ఉంటారు. ఇలా ఎన్నో రకాలుగా ఈ తమలపాకుని వాడుతూ ఉంటారు. అలాగే దీనివలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. సహజంగా చాలామంది తమలపాకుని భోజనం చేసిన తర్వాత తింటూ ఉంటారు. అయితే ఇది మంచి అలవాటు కూడా. అలాగే భారతీయ మతపరమైన సాంప్రదాయాలలో తమలపాకుని కి ఎంతో ప్రాధాన్యత కూడా ఉంది. అదేవిధంగా దీనివలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఈ తమలపాకుని తెలుగులో తమలపాకు, హిందీలో పాన్ కార్డ్ పఠా అని, మలయాళం లో వట్ల అని, తమిళంలో వేతలపాకు అని పిలుస్తూ ఉంటారు. ఈ ఆకులో దయామిన్, నియాసిన్, రైబోలావిన్ ,కెరోటిన్, విటమిన్ సి లాంటి విటమిన్లతో పాటు కాల్షియం లాంటి గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి ఇక అవేంటో చూద్దాం..

Health Benefits : తమలపాకులలో ఆరోగ్య లాభాలు ఇవే…

*తమలపాకులు సుగంధ పినోలిక్ సమ్మేళనాలు ఉండడం మూలంగా కాటేకోల మైన్ ల రిలీజ్ ను ప్రేరేపిస్తుంది. ఇది మానసిక ఒత్తిడిని మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. కావున తమలపాకును తినడం అనేది డిప్రెషన్ నుంచి బయటపడడానికి సులువైన దారి అని చెప్పవచ్చు. *తమలపాకు ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, ఇది ఆక్సీకరణ డిప్రెషన్ ని ఎదుర్కోవడంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా బ్లడ్ లో గ్లూకోజ్ ను కంట్రోల్లో ఉంచడం వలన మంటను కూడా తగ్గిస్తుంది. *తమలపాకులు పాలి పెనాల్స్ అధికంగా ఉంటాయి. కావున మంచి క్రిమినాశక గుణాలు కలిగి ఉన్నాయి. ప్రధానంగా చావి కోల్ జెర్మ్స్ శరీరానికి ఎంతో మేలుని కలగజేస్తాయి.

Health Benefits of betel leaves after meals

Health Benefits of betel leaves after meals

*తమలపాకులు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని పలు అధ్యయనంలో తేలింది. కావున టైప్ టు షుగర్ వ్యాధి వస్తువులకు కూడా దీనిని తినవచ్చు.. *అదేవిధంగా ఊపిరితిత్తులు చాతి ఆస్తమాతో ఇబ్బంది పడే వారికి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అలాగే ఈ తమలపాకులపై ఆవాల నూనె అప్లై చేసి వేడి చేసి చాతిపై పెట్టినట్లయితే గుండె నొప్పి ఇబ్బంది నుండి రక్షిస్తుంది. *తమలపాకుల్ని తినడం వలన మలబద్ధక సమస్యలు కూడా తగ్గిపోతాయి అదేవిధంగా జీర్ణక్రియను కూడా మెరుగు పరుస్తాయి. ఇంకా రక్త ప్రసరణ కూడా సవ్యంగా జరిగేలా చేస్తాయి.

*ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లకు పవర్ హౌస్ లాంటిది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్ బయటికి పంపించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా శరీరంలో సహజ పీహెచ్ స్థాయిలను పునరుద్దిస్తాయి. అలాగే ఉదర సంబంధిత ఇబ్బందులు కూడా తగ్గిపోతాయి. *శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి అలాగే జీర్ణ క్రియ పెంపొందించడానికి, ప్రేగులలో కడుపులో పీహెచ్ లెవెల్స్ ను క్రమబద్ధీకరిస్తాయి. *తమలపాకు అనేది గొప్ప నొప్పి నివారిణి. ఈ ఆకు ఒంటి నొప్పుల నుండి తొందరగా బయటపడేస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది