Black Cumin : నల్ల జీలకర్రను ఎప్పుడైనా చూశారా… దీనిలో మీకు తెలియని ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి… ఏమిటో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Black Cumin : నల్ల జీలకర్రను ఎప్పుడైనా చూశారా… దీనిలో మీకు తెలియని ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి… ఏమిటో తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :19 March 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Black Cumin : నల్ల జీలకర్రను ఎప్పుడైనా చూశారా... దీనిలో మీకు తెలియని ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి... ఏమిటో తెలుసా...?

Black Cumin : ప్రస్తుతం మనం ప్రతిరోజు కూడా జీలకర్ర వాడుతూ ఉంటాం. ఈరోజు వాడే జీలకర్ర గురించి మనకు తెలుసు. నల్ల జీలకర్ర గురించి మీకు తెలుసా.. దీనిని ఎప్పుడైనా చూశారా.. నల్ల జిలక్రరని ప్రతిరోజు గనుక తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. రోజు నల్ల జీలకర్ర నువ్వు తిన్నారంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని నిపుణులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని కూడా కలిగి ఉంటుంది ఈ నల్ల జీలకర్ర. మధుమేహం, గుండె సమస్యలు, ఆస్తమా వంటి అనేక వ్యాధులను నియంత్రించుటకు కూడా నల్ల జిలకర ఉపయోగపడుతుంది. ఇంకా, చర్మం, జుట్టు వెలుగుపరచడానికి కూడా నల్ల జీలకర్ర సహాయపడుతుంది. ఈ నల్ల జీలకర్రను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

Black Cumin నల్ల జీలకర్రను ఎప్పుడైనా చూశారా దీనిలో మీకు తెలియని ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి ఏమిటో తెలుసా

Black Cumin : నల్ల జీలకర్రను ఎప్పుడైనా చూశారా… దీనిలో మీకు తెలియని ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి… ఏమిటో తెలుసా…?

Black Cumin నల్ల జీలకర్ర ప్రయోజనాలు

ప్రతిరోజు ఒక చెంచా తింటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నల్ల జిలక్రర తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే, షుగర్, ఆస్తమా, వంటి సమస్యలు అదుపులోకి వస్తాయి. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను కూడా నివారించవచ్చు. జీలకర్ర ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి కావున వైద్యంలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.

జిల్లా జీలకర్రలో పోషకాలు : నల్ల జీలకర్రలలో ఫైబర్, ప్రోటీన్లు, ఐరన్, సోడియం, క్యాల్షియం, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. విటమిన్లు, విటమిన్ ఎ,విటమిన్ బి,విటమిన్ సి,కూడా అధికంగా ఉన్నాయి. ఈ నల్ల జీలకర్ర నూనెలో 17% ప్రోటీన్, 26% కార్బోహైడ్రేట్లు, 57% నూనెలు ఉంటాయి. ఈ మిశ్రమానికి తేనెను కలిపి తీసుకుంటే మెదడు పనితీరు మెరుగు పడుతుంది.

నల్ల జీలకర్ర ఈ వ్యాధులను నివారించ గలదు : . నల్ల జీలకర్ర ఆస్తమా వ్యాధితో బాధపడేవారు గోరువెచ్చని నీటిలో ఈ నల్ల జీలకర్ర నూనెను, తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. వాతావరణ కాలుష్యం కారణంగా ఆస్తమావ్యాధి విస్తరిస్తున్న ఈరోజుల్లో ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. . నల్ల జీలకర్ర చర్మానికి, జుట్టుకి మంచిది అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మెరిసే చర్మం కోసం నల్ల జీలకర్ర నూనెను నిమ్మరసంలో కలిపి ముఖానికి అప్లై చేయాల, జుట్టు రాలడం, సమస్యలకు ఈ నల్ల జీలకర్ర మంచి పరిష్కారాన్ని ఇస్తుంది.
. డయాబెటిస్ వ్యాధి ఉన్నవారు మూత్రపిండాలకు కలిగే నష్టాన్ని నివారించడంలో నల్ల జిలకర సహాయపడుతుంది. చక్కర స్థాయిలను నియంత్రించటమే కాకుండా, సీరం క్రియేటిన్ స్థాయిని కూడా ప్రభావితం చేయవచ్చు.
. నొప్పితో బాధపడేవారు నల్ల జీలకర్ర నూనెను నుదిటి మీద రాసుకుంటే నొప్పి త్వరగా తగ్గిపోతుంది. జీలకర్రతో కీళ్ల నొప్పులు, కడుపు సమస్యలు, బద్ధకం అంటే అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తుంది.
. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, ఈ నల్ల జీలకర్రను తీసుకుంటే మంచిది కాదు. ఇది కడుపులో పిండానికి, తల్లిపాలకు హాని కలిగించే అవకాశం ఉంది. అందువల్ల ఎప్పుడైనా ఈ నల్ల జీలకర్ర వాడటానికి ముందు వైద్యుని సలహా తీసుకుంటే మంచిది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది