Health Benefits : లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే… నల్ల జీలకర్ర తప్పినిసరి!
Health Benefits : కాలం మారుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లలో చాలా తేడాలు వస్తున్నాయి. రసాయనాలు, కెమికల్స్ సాయంతో పండుతున్న ఆహారమే ఇప్పుడు మనకు దొరుకుతోంది. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పేస్టిసైడ్ మరియు అధిక ప్రమాణ లోహా పదార్థాలు మన శరీరాన్ని చేరుకుని చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇలా చేరుకున్న హానికరమైన పదార్థాలను, లివర్ శుభ్రం చేసుకోవటంలో బలహీన పడుతుంది. అంతే కాకుండా క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన అనారోగ్యాలకు దారి తీస్తోంది. లివర్ భాగంలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువై హేపటైటిస్ లాంటి జబ్బు తీవ్రత పెరుగుతుంది. కాపర్ మరియు ఐరన్ లాంటి ఖనిజ పదార్థాలు శరీరాన్ని చేరుకోవటం వల్ల లివర్ సిస్టు లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మన శరీరాన్ని పెస్టిసైడ్ నుంచి రక్షించటం లివర్ ముఖ్యమైన పని. అలాంటి లివర్-లో ఈ విష పదార్థం అయినా పెస్టిసైడ్ పేరుకుపోవటం వల్ల లివర్ కణలు దెబ్బతింటున్నాయి. సైటోప్లాసం అనే ముఖ్యమైన అణువును నాశనం చేస్తుంది.లివర్ సమస్యల నుంచి బయట పడటానికి నల్ల జీల కర్ర అత్యద్భుతంగా పని చేస్తుంది. నల్ల జీలకర్రకు సంబంధించి ఆయుర్వేదంలో ఎంతో చెప్పబడి ఉంది. నల్ల జీలకర్రలో మూడు అతి ముఖ్యమైన కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. థైమోక్వినోన్,టీ- అనేథోల్టర్పినోయిల్స్ఈ మూడు కాంపౌండ్స్ ఉండటం వల్ల నల్ల జీలకర్ర అంత స్పెషల్ ఫుడ్ గా మారింది. నల్ల జీలకర్రను వాడటం వల్ల లివర్ కణాలు పునరుత్పత్తి జరిగి పెస్టిసైడ్స్-ను మూత్రకోశం మూలన బయటకు నెట్టి వేయబడుతుంది.
నల్ల జీలకర్ర వల్ల కలిగే మరో ముఖ్యమైన ఉపయోగం ఏమిటి అంటే నాడి కణాలను ఉత్తేజితం చేస్తుంది. నర నాడులు ఆక్టివేట్ కావటం వలన మెదుడు కూడా మెరుగు పదుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది.గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు వేసి నీళ్ళు మరుగుతున్న సమయంలో అందులో ఒక టేబుల్ స్పూన్ నల్ల జీలకరను వేసి గ్లాసు నీళ్ళు అర గ్లాసు అయ్యేవరకు మరిగించి. అందులో కలకండ లేక తేనె కలుపుకొని ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఖాళీ కడుపులో తాగడం వల్ల అందులోని ఔషధ లక్షణాలు వెంటనే రక్తంలో చేరి లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయ పడుతుంది. మరో విధానం పప్పుల పొడి, కారం పొడి, కూరలు చేసుకొనే సమయంలో కూడా ఈ నల్ల జీలకర్రను వాడటం వల్ల మంచి ఫలితాలు చూడవచ్చు.