Bottle Gourd : సొరకాయ మన ఆరోగ్యానికి దివ్య ఔషధం… లాభాలు తెలిస్తే… ఆశ్చర్యపోతారు…??
ప్రధానాంశాలు:
Bottle Gourd : సొరకాయ మన ఆరోగ్యానికి దివ్య ఔషధం... లాభాలు తెలిస్తే... ఆశ్చర్యపోతారు...??
Bottle Gourd : ప్రతిరోజు మనం ఎన్నో రకాల కూరగాయలను తీసుకుంటూ ఉంటాం. అయితే వాటిలలో సొరకాయ కూడా ఒకటి. ఈ సొరకాయలో ఫైబర్ అనేది అధిక మోతాదులో ఉంటుంది. అలాగే దీనిలో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు కండరాలను కూడా ఎంతో బలంగా చేస్తుంది. దీంతో గ్యాస్ మరియు అసీడీటీ లాంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. ఈ సొరకాయలో ఫైబర్ కంటెంట్ మరియు నీటి శాతం ఎక్కువగా ఉండడం వలన మలం సాఫీగా సాగుతుంది. అలాగే మలబద్ధకం కూడా దూరం అవుతుంది. అలాగే ఈ సొరకాయలో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ సొరకాయ రక్తపోటును కంట్రోల్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అందుకే అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడేవారు సొరకాయను తీసుకుంటే మంచిది…
ఈ సొరకాయలో యాంటీ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. దీని వలన చర్మం ఎప్పుడు యవ్వనంగా కనిపిస్తుంది. అలాగే ఈ సొరకాయలో గ్లైసోబిక్ ఇండెక్స్ కూడా ఉంటుంది. అందుకే డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారు సొరకాయను తీసుకోవచ్చు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా అదుపు చేస్తుంది. ఈ సొరకాయలో ఉన్నటువంటి విటమిన్లు మరియు మినరల్స్ లాంటివి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాక జుట్టు రాలడాన్ని మరియు చుండ్రు సమస్యలను కూడా తగ్గిస్తుంది…
సొరకాయలో విటమిన్ సి కూడా అధిక మోతాదులో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. అలాగే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుండి మన శరీరాన్నిరక్షిస్తుంది. అలాగే ఈ సొరకాయలో కాల్షియం మరియు ఫాస్పరస్ లాంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను కూడా ఎంతో బలంగా చేస్తాయి. బరువు తగ్గాలి అని అనుకునే వారికి సొరకాయ తింటే మంచి ఫలితం ఉంటుంది. ఈ సొరకాయలో ఉండే వాటర్ కంటెంట్ తొందరగా కడుపు నిండిన ఫీలింగ్ ఇచ్చి ఆకలిని కంట్రోల్ చేస్తుంది. అంతేకాక చాలామందికి చిన్న వయసులోనే ముఖం పైన ముడతలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ ముడతలను తగ్గించడంలో సొరకాయ బేస్ట్ గా పని చేస్తుంది. Health benefits of bottle gourd