Health Benefits : రోజు ఒక కప్పు శనగలు తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు…!
Health Benefits : మన శరీరానికి శక్తినిచ్చే అద్భుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో శనగలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని చాలామంది గుగ్గిళ్ళ రూపంలో తీసుకుంటారు. కొందరు వేయించిన శనగలను తింటారు. అయితే వీటిని రోజూ ఒక కప్పు మోతాదులో తీసుకొని వాటిని ఉడకబెట్టుకొని తింటే దాంతో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. శరీరానికి శక్తి వస్తుంది. పోషకాలు అందుతాయి. సెనగలను రోజూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. మధుమేహం ఉన్నవారికి సెనగలు ఒక వరమని చెప్పవచ్చు….
ఎందుకంటే మాంసంలో ఉండే ప్రోటీన్లు సెనగలలో లభిస్తాయి. పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం ఎన్నో రకాల మినరల్స్ శనగల్లో ఉంటాయి. ఇది తిని ఎక్కువసేపు ఉన్న ఆకలి వేయకుండా చేస్తాయి. దీంతో బరువు తగ్గాలనుకునే వారికి సెనగలు బాగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. దీంతో రక్తం బాగా పడుతుంది. ఇది రక్తహీనత ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ మంచి శనగలలో ఉపయోగకరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చక్కగా నిద్ర పట్టేలా చేస్తాయి. దీంతో నిద్రలేమి దూరం అవుతుంది. అంతేకాదు ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా తగ్గిపోతాయి. సెనగల్లో ఆల్ఫా సమృద్ధిగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్లో తగ్గించడంతోపాటు ఉండే ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఐరన్ ప్రోటీన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండటం వల్ల శనగలు శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉండటం వల్ల రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. శరీరంలో ఎక్కువగా ఉన్న ఉప్పును బయటకి పంపుతుంది. పచ్చకామెర్లు ఉన్నవారు శనగలను తింటే త్వరగా కోలుకుంటారు. వీటిలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండటం వల్ల చర్మ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. దురద వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది..