Winter Season : చలికాలంలో నిద్ర మత్తు కామన్. మరి దీనిని ఎలా వదిలించుకోవాలి అని ఆలోచిస్తున్నారా… ఈ చిట్కాలను ట్రై చేయండి…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Winter Season : చలికాలంలో నిద్ర మత్తు కామన్. మరి దీనిని ఎలా వదిలించుకోవాలి అని ఆలోచిస్తున్నారా… ఈ చిట్కాలను ట్రై చేయండి…??

 Authored By ramu | The Telugu News | Updated on :23 November 2024,2:03 pm

ప్రధానాంశాలు:

  •  Winter Season : చలికాలంలో నిద్ర మత్తు కామన్. మరి దీనిని ఎలా వదిలించుకోవాలి అని ఆలోచిస్తున్నారా... ఈ చిట్కాలను ట్రై చేయండి...??

Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ నిద్రమత్తు కారణంగా సమయానికి లేవరు. ఒకవేళ లేచిన ఏ పని చేయాలి అనిపించదు. అలాగే ఈ కాలంలో అన్ని పనులు కూడా చాలా ఆలస్యంగా జరుగుతాయి. అంతేకాక చాలా బద్ధకంగా కూడా అనిపిస్తుంది. అంతేకాక ఒక్కొక్కసారి అలసట మరియు నీరసంగా కూడా అనిపిస్తుంది. అలాగే ఎక్కువ నిద్ర మత్తు వస్తుంది. అందులోనూ ఈ కాలంలో ఉదయం నిద్ర లేవాలి అంటే యుద్ధమే చేయాల్సి వస్తుంది. తొందరగా లేవాలి అనుకున్న బెడ్ మీద నుంచి కిందకి దిగబుద్ధి కాదు. కొద్దిసేపు పడుకుందాం అని అనిపిస్తుంది. ఇలా కేవలం చిన్న పిల్లలకు మాత్రమే కాదు పెద్ద వాళ్లకు కూడా ఇలాగే ఉంటుంది. మరి ఈ నిద్రమత్తును ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Winter Season చలికాలంలో నిద్ర మత్తు కామన్ మరి దీనిని ఎలా వదిలించుకోవాలి అని ఆలోచిస్తున్నారా ఈ చిట్కాలను ట్రై చేయండి

Winter Season : చలికాలంలో నిద్ర మత్తు కామన్. మరి దీనిని ఎలా వదిలించుకోవాలి అని ఆలోచిస్తున్నారా… ఈ చిట్కాలను ట్రై చేయండి…??

ఉదయాన్నే నిద్ర లేవాలి అని చాలామంది అలారం పెట్టుకుంటారు. అయితే చాలామంది చేసే తప్పు ఏమిటి అంటే అలారం మోగిన తర్వాత దానిని ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటారు. కొంతమంది అయితే స్నూజ్ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే నిద్రమత్తు అసలు పోదు. మీకు నిద్రమత్తు వెంటనే పోవాలి అంటే మీరు లేవగానే నీటిని తాగండి. ఉదయాన్నే నీరు తాగితే మంచిదే…

అలాగే ముఖాన్ని నీళ్లతో కడుక్కుంటే నిద్ర ఎగిరిపోతుంది. అలాగే చాలా మందికి ఉదయాన్నే బెడ్ టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ముందు ఈ అలవాటును మానుకోండి. చలికాలంలో నిద్రమత్తు పోవాలి అంటే చల్లటి నీటితో స్నానం చేయాలి. ఇలా చల్లనీలతో స్నానం చేయటం అనేది కష్టమైన పని అయినా చల్లటి నీళ్లతో స్నానం చేస్తే అలసట మరియు ఒత్తిడి కండరాల నొప్పులు కూడా తగ్గిపోతాయి

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది