Health Benefits : ఉదయాన్నే ఈ ఆకుల్ని నమిలితే రోగాలన్నీ మాయం.. తినేటప్పుడు ఇవి పాటించండి
Health Benefits : ఈ మధ్యకాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్యలు డయబెటిస్, అధిక బరువు, మలబద్దకం, గ్యాస్ వంటి ఇతర సమస్యలు. మారుతున్న జీవన శైలీకి అనుగుణంగా తీసుకుంటున్న ఫుడ్ వల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. బ్లడ్ లో షుగర్ లెవల్స్ పెరిగి ఎంతో మంది నిత్యం మెడిసిన్ వాడాల్సిన పరిస్థితి. ఇష్టమైన ఫుడ్ కూడా తీనలేకపోతున్నారు. ఇక అధిక బరువుతో బాధపడే వారు, మలబద్దకం సమస్యతో ఇబ్బందిపడే వారి సంఖ్య కూడా రోజురోజుకి పెరిగిపోతోంది. వీటన్నింటికి సహజ పద్దతుల్లో చెక్ పెట్టే విధానం ఇప్పుడు చూద్దాం.. కరివేపాకు.. ఇది ఆరోగ్యనికి ఎంత మేలు చేస్తుందో చాలా మందికి తెలియదు అందుకే ఆహారంలో వచ్చినప్పుడు తీసి పక్కన పారేస్తుంటారు. కానీ.. కరివేపకు చేసే ప్రయోజనాలు తెలిస్తే జీవితంలో ఇంకెప్పుడు ఆ పనిచేయరు ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం…
రెగ్యూలర్ గా పరిగడుపున నాలుగు ఆకులు నమిలితే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టేయొచ్చు. ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడేవారు ఉదయాన్నే టిఫిన్ కి ముందు నాలుగు కరివేపాకు ఆకుల్ని తినాలి. కరివేపాకులో హైపోగ్లైసీమిక్ గుణాలున్నాయి. ఇది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది.అలాగే జీర్ణవ్యవస్థను మెరుగుపడాలంటే ఉదయాన్నే నాలుగు కరివేపాకు ఆకులను నమలి తినాలి. దీంతో కుడుపు ఉబ్బరం, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపషమనం ఉంటుంది. జీర్ణవ్యస్థకు సంబంధించిన వ్యాధులన్నీ తగ్గిపోతాయి కూడా. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచడమే కాకుండా శరీరాన్ని కూడా దృఢంగా ఉంచుతుంది. ఈ ఆకుల్ని రోజు ఉదయాన్నే తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడి సమస్యలను తొలగిస్తుంది.
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది కొవ్వు కాలేయ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.అలాగే కరివేపాకు ఆకుల్ని రోజు ఉదయం తీసుకుంటే కళ్ల సమస్యలు తగ్గి కంటి చూపు మెరుగవుతుంది. ఈ ఆకుల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరిచి సమస్యలన్నింటిని దూరం చేస్తుంది. అంతేకాకుండా జుట్టు సమస్యలను కుడా తగ్గిస్తుంది.ఇక అధిక బరువుతో బాధపడేవారికి కరివేపాకుల ఆకులు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాయి. ఇందులో ఇథైల్ అసిటేట్, మహానింబైన్, డైక్లోరోమిథైన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి చాలా మేలు చేస్తాయి.