Gaddi Chamanthi Leaves : ఇదేదో పిచ్చి మొక్క అనుకుంటే పొరపాటే… దీని ప్రయోజనాలు తెలిస్తే… అస్సలు వదలరు…!!
ప్రధానాంశాలు:
Gaddi Chamanthi Leaves : ఇదేదో పిచ్చి మొక్క అనుకుంటే పొరపాటే... దీని ప్రయోజనాలు తెలిస్తే... అస్సలు వదలరు...!!
Gaddi Chamanthi Leaves : మనకు పకృతి అనేది సహజంగానే ఎన్నో రకాలుగా అద్భుతమైన వరాలను ఇస్తుంది. అయితే వాటిలో చాలా వాటి గురించి మనకు అంతగా తెలిసి ఉండదు. అలాగే రోడ్డు పక్కల వాటంతటావే పెరిగే చెట్లలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. అలాంటి వాటిలలో గడ్డిచామంతి కూడా ఒకటి. అయితే ఇది ఎక్కువగా పొలాల గట్లపై మరియు కాలువల పక్కన పెరిగే ఈ మొక్క సాధారణంగా కనిపిస్తూనే ఉంటుంది. అయితే మనకు ఫ్రీగా దొరికే ఈ మొక్కలలో ఎన్నో రకాల గుణాలు ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అయితే మనం చిన్నప్పుడు ఈ గడ్డి చామంతి ఆకులను పలక శుభ్రం చేసేందుకు ఎక్కువగా వాడే వాళ్ళం. ఈ మొక్కను కొన్ని ప్రాంతాలలో నల్లారం అని కూడా అంటారు. అలాగే ఈ మొక్క యొక్క ఆకులను ఆయుర్వేద మందుల తయారీలో ఎక్కువగా వాడతారు…
ఈ ఆకులలో యాంటీ కార్సినోజెనిక్ అనేది ఉంటుంది. ఇది డయాబెటిస్ ను అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆకులను నమిలి తీసుకోవడం వలన డయాబెటిస్ లేవల్స్ అనేవి అదుపులోకి వస్తాయి. అలాగే జుట్టు సమస్యలకు మరియు పంగల్ ఇన్ఫెక్షన్లకు ఈ ఆకులను వాడితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ ఆకులను యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కూడా దాగి ఉన్నాయి. అలాగే జలుబు మరియు దగ్గు, గొంతు గరగరా లాంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఈ ఆకులు గాయాలను తగ్గించటంలో కూడా బాగా ఉపయోగపడతాయి. మనకు ఏదైనా గాయం తగిలినప్పుడు ఈ ఆకుల రసాన్ని గాయం పై పిండుకోవాలి. ఇలా చేయడం వలన గాయాలు అనేవి తొందరగా మానుతాయి. అలాగే గాయం తగిలిన చోట ఈ రసాన్ని పిండితే రక్తం తొందరగా గడ్డ కడుతుంది.
ఇకపోతే జుట్టు ఆరోగ్యాన్ని రక్షించటంలో కూడా ఈ గడ్డి చామంతి ఆకులు ఎంతో చక్కగా పనిచేస్తాయి. ఈ ఆకులను ముందుగా మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దాని తర్వాత ఆ పేస్ట్ ను ఆవ నూనెలో కలిపి నూనెను బాగా మరిగించాలి. ఆ తర్వాత నునేను వడకట్టుకొని ఆ నునేను ఒక బాటిల్ లో పోసుకోవాలి. ఇప్పుడు మీరు తయారు చేసుకున్న నూనె తలకు అప్లై చేసుకోవాలి. ఇలా గనక చేస్తే మీ జుట్టు ఎంతో ఒత్తుగా పెరుగుతుంది. అలాగే జుట్టు నల్లగా కూడా మారుతుంది. అంతేకాక చుండ్రు సమస్య కూడా ఈజీగా తగ్గిపోతుంది. అలాగే శ్వాసకు సంబంధించిన సమస్యలు కూడా నాయం అవుతాయి. అంతేకాక లివర్ ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఈ ఆకులతో కషాయం చేసుకుని తాగితే ఈ సమస్యలు అన్ని ఇట్టే పోతాయి