Health Benefits : మీకు గ్యాస్ ట్రబుల్ ఉందా… అయితే ఈ పండ్లను తినండి…
Health Benefits : ఇప్పుడు చాలామందికి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే సరైన సమయంలో ఆహారాన్ని తీసుకోకపోవడం, బయట ఫుడ్స్ ను ఎక్కువగా తినటం, పరిమితికి మించి ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడం, ఇలా అనేక కారణాల వలన కడుపు కి సంబంధించిన సమస్యలు గ్యాస్ ట్రబుల్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి మొదలగు సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు తగ్గాలని వివిధ రకాల మెడిసిన్స్ను వాడుతుంటారు. ఎక్కువగా మెడిసిన్స్ ను వాడితే సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వరకు ప్రకృతిలో దొరికే కొన్ని పండ్ల తో మీరు సులభంగా గ్యాస్ సమస్యలను తగ్గించు కోవచ్చు. అవి ఏం పండ్లు, ఎటువంటి సమస్యలను తగ్గిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
క్రేన్ బెర్రీస్ గ్యాస్ సమస్యలను తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. ఇవి ఆన్లైన్ స్టోర్స్ లోనూ, డ్రై ఫ్రూట్స్ షాప్ లో దొరుకుతాయి. క్రేన్ బెర్రీస్ లో విటమిన్ సి, ఇ,ఎ,కె, బి 5 మరియు బి 6 పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. అంతేకాకుండా వీటిలో కాల్షియం, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో దొరుకుతాయి. అందుకే వీటిని తింటే మనకు ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉన్నాయి. ఈ క్రేన్ బెర్రీస్ గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యల నుంచి మన శరీరానికి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతాయి. అలాగే మన బాడీ లోకి ఎటువంటి వైరస్ లు పోకుండా కాపాడుతాయి. క్రేన్ బెర్రీస్ తినడం వలన మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మీకు ఎప్పుడైనా ఆకస్మాత్తుగా గ్యాస్ ప్రాబ్లం వస్తే ఈ చిట్కాను తయారు చేసుకోండి. అది ఎలాగంటే..
స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాసు నీళ్లు పోసి రెండు స్పూన్ల క్రేన్ బెర్రీస్ ను వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి. తరువాత ఆ నీళ్లను వడకట్టుకోవాలి. ఆ గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూన్ తేనె వేసి బాగా కలిపి తాగితే గ్యాస్ సంబంధించిన గ్యాస్, కడుపునొప్పి, కడుపుబ్బరం అన్ని సమస్యలు తగ్గుతాయి, అంతేకాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి సులువుగా ఉపశమనం కలుగుతుంది. వడగట్టాక మిగిలిన ఉడికిన క్రేన్ బెర్రీసిను పడవేయకుండా తినవచ్చు. అంతేకాకుండా గోరువెచ్చని నీళ్లు తాగితే కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు నొప్పి నుంచి ఊరట లభిస్తుంది. అలాగే చిగురు వాపు, దంత సమస్యలను తగ్గిస్తాయి.ఈ క్రేన్ బెర్రీస్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వలన అధిక బరువు ఉన్నవారు సులువుగా బరువు తగ్గవచ్చు. క్రేన్ బెర్రీస్ తినడం వలన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు ప్రకృతిలో దొరికే క్రేన్ బెర్రీస్ ను తినడం మంచిది.