Ghee : ప్రతిరోజు నెయ్యి తీసుకుంటే ఎన్ని లాభాలో…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ghee : ప్రతిరోజు నెయ్యి తీసుకుంటే ఎన్ని లాభాలో…!

 Authored By ramu | The Telugu News | Updated on :14 July 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Ghee : ప్రతిరోజు నెయ్యి తీసుకుంటే ఎన్ని లాభాలో...!

Ghee : వర్షాకాలం వచ్చిందంటే అనేక ఆరోగ్య సమస్యలను తీసుకువస్తుంది. ఈ సమయంలోనే ఆరోగ్య పై దృష్టి పెట్టాలి. అయితే ఈ సీజన్ లో ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఈ ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుని ఇమ్యూనిటీ బలాన్ని పెంచుకోవాలి. అందులో ముఖ్యమైనది నెయ్యి. దీనిని ప్రతిరోజు వన్ టీ స్పూన్ తీసుకోవడం వలన అనేక రకాల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…..

Ghee ఇమ్యూనిటీ

ఇమ్యూనిటీ పెరగాలంటే నెయ్యిని తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే నెయ్యిలో కొవ్వులు కరిగించే విటమిన్ డీ , కే ,ఈ ఉంటాయి. అదేవిధంగా నెయ్యిలో యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ మరియు ఆంటీ బ్యాక్టీరియల్ వంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే నెయ్యి ఇతర ఆహార పదార్థాల నుంచి పోషకాలను గ్రహించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు.

Ghee జీర్ణ సమస్యలు

ఈ సీజన్ లో జీర్ణ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే గ్యాస్ , అసిడీటీ వంటి సమస్యలకు నెయ్యి గొప్ప ఔషధంగా చెప్పుకోవచ్చు. ఉదయం గ్లాస్ గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తీసుకుంటే మలబద్ధకం తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది . అదేవిధంగా ఇందులో ఉండే బ్యుట్రిక్ యాసిడ్ ను పెద్ద పెగు కణాలు తమకు ఇష్టమైన శక్తివనరుగా వాడడం జరుగుతుంది.

Ghee ప్రతిరోజు నెయ్యి తీసుకుంటే ఎన్ని లాభాలో

Ghee : ప్రతిరోజు నెయ్యి తీసుకుంటే ఎన్ని లాభాలో…!

Ghee జుట్టు చర్మానికి

జుట్టు చర్మానికి నెయ్యి చాలా మంచిది. ఇది వర్ష కాలంలో చాలా ఉపయోగపడుతుంది. నెయ్యిని తీసుకోవడం వలన జ్ఞాపకశక్తి పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఇది ముఖ్యంగా పిల్లల జ్ఞాపకశక్తిని బాగా మెరుగుపరుస్తుంది. అలాగే నెయ్యిని తీసుకోవడం వలన బరువు తగ్గుతారు. ఇక నెయ్యిలో మంచి ఫ్యాట్స్ ఉంటాయి. అయితే ఆరోగ్యానికి ఎంత మంచిది అయినప్పటికీ ఎక్కువ మోతాదులు తీసుకుంటే మాత్రం కచ్చితంగా హాని జరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఆహారమైన మితంగా తీసుకోవడం మంచిది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది