Health Benefits : వర్షాకాలంలో వారానికి మూడుసార్లు అయిన ఈ కూరను తినాల్సిందే…
మన తెలుగువారికి గోంగూర అంటే చాలా ఇష్టం. గోంగూర లేకపోతే ఒక ముద్ద కూడా దిగదు. పప్పు, గోంగూరను కలిపి తింటే ఆ రుచిని మాటల్లో చెప్పలేం. గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. గోంగూరను తలుచుకుంటేనే నోరూరిపోతుంది కదా. ఒక రకంగా చెప్పాలంటే గోంగూర అంటే మనవాళ్ళు ప్రాణం పెట్టేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే గోంగూర తెలుగువాడి జీవనంలో అంతలా ముడిపడి పోయింది. అందరికీ అందుబాటు ధరలో దొరుకుతుంది. పుల్లని రుచితో ఉండే గోంగూర వలన ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గోంగూరలో విటమిన్ ఏ,సి,బి6 అనే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
అలాగే దీనిలో ఐరన్, మెగ్నీషియం పొటాషియం, క్యాల్షియం, సమృద్ధిగా ఉన్నాయి. అందుకే గోంగూరను ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వినియోగిస్తారు. వాతావరణం మారుతున్న సమయంలో మనకు దగ్గు, జలుబు వంటివి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం తినే ఆహారంలో గోంగూరని భాగంగా చేసుకుంటే మంచి ప్రయోజనం కలుగుతుంది. గోంగూర ఒక ఔషధంగా పనిచేస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు గోంగూరను తినడం వలన ఆ సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు. గోంగూర లో ఉండే విటమిన్ కె రక్తంహీనత సమస్యను నివారిస్తుంది. వివిధ రకాల మెడిసిన్స్ వాడే బదులు మనకు తరచూ దొరికే గోంగూరను తినే ఆహారంలో తీసుకున్నారంటే రక్తహీనత బారిన పడకుండా ఉంటారు. కనుక బాడీలో సరిపడా రక్తం లేని వారు ప్రతిరోజు గోంగూరను తినడం వలన మంచి ఫలితం లభిస్తుంది.

Health Benefits of gongura
గోంగూరలో ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్ పుష్కలంగా ఉండటం వలన అవి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేసి గుండె సంబంధిత వ్యాధులను రాకుండా కుండా చేస్తాయి. అలాగే కిడ్నీ వ్యాధులను, క్యాన్సర్ వంటి వ్యాధులు నివారణకు సహాయపడతాయి. అలాగే డయాబెటిస్ సమస్యతో బాధపడే వారికి గోంగూర చాలా మంచిది. గోంగూరను తినడం వలన రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి షుగర్ లెవెల్స్ లను తగ్గించి చక్కర వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది. గోంగూరలో క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు గోంగూరను తినడం వలన ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి.
గోంగూరలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అందువలన గోంగూరను తీసుకుంటే కంటి సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా రే చీకటితో బాధపడేవారు ప్రతిరోజు గోంగూరను తినే ఆహారంలో తీసుకోవడం వలన ఆ సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు.