Gonguura : ఇది రుచికి ఎంతో పుల్లగా ఉంటుంది… దీనిని తింటే మటన్ తిన్నంత బలం… ఏమిటో తెలుసా…?
ప్రధానాంశాలు:
Gonguura : ఇది రుచికి ఎంతో పుల్లగా ఉంటుంది... దీనిని తింటే మటన్ తిన్నంత బలం... ఏమిటో తెలుసా...?
Gonguura : ఇది ఒక ఆకుకూర. ఎంతో రుచిగా తినడానికి పుల్లగా ఉంటుంది. ఈ ఆకుతో పచ్చడి, పప్పులో, ఇంకా పులుసు వంటివి కూడా చేస్తారు. ఇంకా మటన్, చికెన్,చేపలు వంటి కాంబినేషన్ తో కూడా వండుతారు. మరి ఆకుకూర ఏమిటంటే.. గోంగూర.. దీనినే పుంటి కూర అని కూడా అంటారు. ఇలాంటి కాంబినేషన్లో వంటకాలను కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. గోంగూరని ఎలా ఉండినా సరే దాని రుచి అమోఘం. అదిరిపోతుంది.. అంతేకాదు, ఆరోగ్యపరంగా కూడా ఈ గోంగూర ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుందని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రతిసారి కుంటి కూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం…

Gonguura : ఇది రుచికి ఎంతో పుల్లగా ఉంటుంది… దీనిని తింటే మటన్ తిన్నంత బలం… ఏమిటో తెలుసా…?
ఈ గోంగూరలో అనేక పోషక విలువలు ఉన్నాయి. ముఖ్యంగా గోంగూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కొత్త హీనతతో బాధపడే వారికి ఈ గోంగూర తింటే ఆ సమస్య తగ్గవచ్చు. శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.ఈ గోంగూర లో కాల్షియం, ఐరన్, విటమిన్ సి, రైబో ఫ్లెవిన్, పోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. ఈ గోంగూరలో క్యాల్షియం ఉండుట చేత ఎముకలను బలంగా ఉంచుతుంది.
ఇంకా గోంగూరిలో అధికంగా ఉండే విటమిన్ ఎ, ఇది కంటి చూపుకి ఎంతో మేలు చేస్తుంది. ఇది తింటే కంటి సమస్యలు దూరం అవుతాయి. లో ఉండే ఫోలిక్ యాసిడ్ గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. నాకు కూరలో పీచు కూడా అధికంగా ఉంటుంది. ద్వారా జీర్ణ సమస్యలను నివారిస్తుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను కూడా నివారించవచ్చు.
గాయాలు, పుండ్లను తగ్గించడంలో కూడా ఈ ఆకుకూర పని చేస్తుంది. ఆ పుండ్లపై ఈ ఆకులతో ఆముదంతో వేడి చేసి కట్టులాగా కట్టారంటే అవి త్వరగా మానుతాయి. గడ్డలు ఉన్న కరిగిపోతాయి. ఇంకా నొప్పులు వాపుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
గోంగూర లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. కాబట్టి గోంగూరను తరచూ తింటే రేచీకటి సమస్య తగ్గుతుంది. కంటి చూపు స్పష్టంగా ఉంటుంది. దృష్టి దోషంతో బాధపడేవారు తరచూ కుంటి కూరను తింటే మేలు జరుగుతుంది. ఈ గోంగూర మొక్క పూలను దంచి రసం తీసి దాన్ని వడకట్టి, అందులో అరకప్పు పాలు కలిపి,ఉదయం సాయంత్రం రెండు పూటల సేవించాలి. ఇలా చేస్తే రేచీకటి సమస్యలు తగ్గుతాయి. కంటి చూపుకి ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. కంటిచూపు సరిగ్గా కనబడుతుంది. గోంగూరలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి తెల్లని గోంగూర, ఇది అంత పుల్లగా ఉండదు. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఎక్కువగా తీసుకోవచ్చు. ఎర్రని పుల్లటి కూరను తరచూ వంటల్లో వాడుతూ ఉంటాం. పుల్లటి గోంగూర గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. తెల్లని పుంటి కూరతో నిల్వ పచ్చడి పెడతారు. గోంగూర పచ్చడి టేస్ట్ చూస్తే వదిలిపెట్టరు.. ముఖ్యంగా ఈ గోంగూరలో విటమిన్స్ మటన్ లో ఉన్న విటమిన్స్ కి సమానం. ఎందుకంటే, మటన్ లో ఉన్న విటమిన్స్ ఈ గోంగూర లో ఉంటాయి. కాబట్టి మటన్ ఎక్కువగా తినలేని వారు ఈ గోంగూరని తిన్నా కూడా ఆ విటమిన్స్ మన శరీరానికి అందుతాయి. అంత ఎనర్జీ వస్తుంది ఈ గోంగూరతో. ఐరన్ తక్కువగా ఉన్నవారికి ఈ గోంగూర అద్భుతంగా పనిచేస్తుంది. గోంగూర మలబద్ధకాన్ని, రే చీకటిని తొలగిస్తుంది. అయితే, ఈ గోంగూరను, వేడి శరీరం ఉన్నవారికి, వాతం చేసిన వారికి ఈ గోంగూరను తినకూడదు. దగ్గు ఆయాసం, తుమ్ములతో బాధపడే వారికి చాలా మేలు చేస్తుంది.