Health Benefits : అన్ని సీజన్లో దొరికే ఈ ఆకులో మీకు తెలియని కొన్ని లాభాలు… అసలు వదలరు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : అన్ని సీజన్లో దొరికే ఈ ఆకులో మీకు తెలియని కొన్ని లాభాలు… అసలు వదలరు…

 Authored By aruna | The Telugu News | Updated on :13 August 2022,5:00 pm

Health Benefits : మునగాకు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఎక్కువగా ఈ మునగ చెట్టు నుంచి వచ్చే కాయలతో ఎన్నో రకాల వంటలను చేస్తూ ఉంటారు. అయితే సహజంగా అందరూ మునగ కాయలు మాత్రమే ఉపయోగపడతాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మునగ ఆకులతో కూడా ఎన్నో లాభాలు ఉన్నాయన్న సంగతి కొందరికి తెలియదు. ఈ మునగాకులో ఎన్నో రకాల లాభాలను కలిగి ఉండడం ఆశ్చర్యకరం. దీని గురించి మీకు తెలిస్తే అస్సలు దీనిని వదలరు. అయితే ఈ మునగాకును మనం నిత్యము వండుకునే కూరలలో కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా దీనిని పొడిగా చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఈ మునగాకులో క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఏ సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

దీనిలో పాలలో కంటే ఎక్కువగా ఈ మునగాకులోనే 17 రెట్లు క్యాల్షియం ఉంటుంది. ఈ మునగాకు నిత్యము తీసుకున్నట్లయితే దంతాలు బలంగా, దృఢంగా ,ఎముకలు గట్టిగా ఆరోగ్యవంతంగా ఉంటాయి. అందుకే ఎదిగే పిల్లలకు ఈ మునగాకు మంచి ప్రయోజనాలను కలిగిస్తుంది. అదేవిధంగా దీనిలో అధికంగా ప్రోటీన్ కూడా ఉంటుంది. కొందరు మాంసాహారం ముట్టని వారు ఈ మునగాకు తీసుకోవడం వలన ఎంతో ప్రోటీన్ అందుతుంది. అదేవిధంగా ఈ మునగాకులో పొటాషియం అరటిపండు లో కన్నా 15 రెట్లు అత్యధిక పొటాషియం కలిగి ఉంటుంది. దీనివలన బ్లడ్ సర్కులేషన్ సరిగా జరిగి రక్తపోటును నుండి కాపాడుతుంది. అలాగే గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా తగ్గుతాయి.

Health Benefits of Moringa Leaves which will be available in All Seasons

Health Benefits of Moringa Leaves which will be available in All Seasons

అయితే ఈ మునగాకును ఏదో ఒక రూపంలో నిత్యము 7 గ్రాములు తీసుకోవడం వలన బ్లడ్ లో ఉండే షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది. అలాగే ఈ ఆకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచడంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే డయాబెటిస్ బాధితులకు ఈ మునగాకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.
అలాగే ఈ ఆకులో అమినో ఆమ్లాలు పుష్కలంగా ఉండటం వలన కంటికి సంబంధించిన వ్యాధులకి కూడా చాలా బాగా సహాయపడుతుంది. దృష్టిలోపం, రేచీకటి లాంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఈ మునగాకు నిత్యము 7 గ్రాములు చొప్పున మూడు నెలల పాటు తీసుకున్నట్లయితే ఎన్నో వ్యాధుల బారి నుండి బయటపడవచ్చు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది