Health Benefits : మునగాకులో కొన్ని రకాల ప్రయోజనాలు మీకు తెలిస్తే మీరు షాక్ అవుతారు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : మునగాకులో కొన్ని రకాల ప్రయోజనాలు మీకు తెలిస్తే మీరు షాక్ అవుతారు…

 Authored By aruna | The Telugu News | Updated on :8 August 2022,5:00 pm

Health Benefits : మునగాకు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దీని గురించి అందరూ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. దీనిలో ఎన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయో ఇది ఎలా ఉపయోగపడుతుందో మనం తెలుసుకుందాం.. ఈ ఆకులో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అదేవిధంగా దీనిని మనం కొనవలసిన అవసరం ఉండదు. ఈ చెట్లు ఎక్కువగా ఇప్పుడు ఇంటి ఆవరణలో పెంచుతున్నారు. అయితే దీనిని ఎక్కువగా మునగ కాయల కోసం పెంచుకుంటూ ఉంటారు. కానీ ఈ ఆకుల వలన కూడా ఉపయోగాలు ఉన్నాయి. అని చాలా తక్కువ మందికి తెలుసు. అయితే వీటిలో ఉండే కొన్ని ఉపయోగాలు మీకు తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈ మునగాకు టేస్ట్ కి చాలా అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి. అలాగే ఈ మునగ పువ్వులు, కాయలలో కూడా అధికంగా పోషకాలు ఉంటాయి. అయితే ఈ మునగాకు లో ఉన్న ఉపయోగాలు గురించి చూద్దాం. ఈ మునగాకు గురించి తెలిస్తే మీరు నిత్యము ఆహారంలో వాడుతారు. అయితే ఈ మునగాకు ఎక్కువగా ఆడవారిలో వచ్చే సమస్యలకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

మహిళలకు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వారికి ఎక్కువ ఐరన్, ప్రోటీన్, క్యాల్షియం అనేవి చాలా అవసరం. డెలివరీకి ముందు అలాగే డెలివరీ తర్వాత వచ్చే కొన్ని రకాల ఇబ్బందులను ఈ మునగాకునుండి తగ్గించుకోవచ్చు. ఈ ఆకు తీసుకోవడం వలన బాలింతలకు పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. అదేవిధంగా ఈ మునగాకు అలాగే పువ్వులలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. దానివల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తాయి. ఈ మునగాకుని నిత్యము తీసుకోవడం వలన విటమిన్ సి పొందుతారు. అదేవిధంగా పిరియడ్ టైం లో వచ్చే నొప్పి నుండి విముక్తి కలుగుతుంది. అలాగే పిల్లలకి కూడా ఈ మునగాకు తీసుకోవడం చాలా అవసరం. ఈ ఆకులో ఖనిజాలు, క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్స్ ఎలా ఎన్నో రకాల విటమిన్లు అధికంగా ఉంటాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు కు, ఎముకల లో బలం కోసం ఈ మునగాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే దీనిని మనం ప్రతిరోజు వండుకునే వంటల్లో దీనిని వాడుకోవచ్చు.

Health Benefits of Munagaku In Telugu

Health Benefits of Munagaku In Telugu

అంటే వండుకునే పప్పులో కానీ, ఏదైనా సాంబార్లో కానీ ఇలా కూరలో కరివేపాకు లాగా వేసుకోవచ్చు. అలాగే ఈ మునగాకు మధుమేహాన్ని కూడా నివారించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మునగాకులో ఎక్కువగా ఫైబర్ ఉండడం వలన బ్లడ్ ప్యూరిఫై చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా గాలి బ్లాడర్ పనితీరును బాగా ఉత్పత్తి పరిస్తుంది. అలాగే ఈ ఆకుతో ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా చేస్తాయి. అదేవిధంగా శ్వాసకోశ సంబంధిత జబ్బులను కూడా నివారిస్తుంది. అదేవిధంగా బాడీలో ఉండే చెడు వ్యర్ధాలను సులువుగా బయటికి నెట్టేస్తుంది. అలాగే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అదేవిధంగా మలబద్ధకం లాంటి సమస్యలు కూడా దూరమవుతాయి. అదేవిధంగా ఎముకలలో గుజ్జు బాగా పెరుగుతుంది. ఇలాంటి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ మునగాకును నిత్యము తీసుకోవడం మంచిది అని వైద్య రంగం వారు చెప్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది