Mutton Bone Soup : పాయసూప్ తో సీజనల్ వ్యాధులకు చెక్… తరచుగా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో…!
ప్రధానాంశాలు:
Mutton Bone Soup : పాయసూప్ తో సీజనల్ వ్యాధులకు చెక్... తరచుగా తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో...!
Mutton Bone Soup : చలికాలం ప్రారంభమైందంటే చాలు ప్రతి ఒక్కరికి వేడివేడిగా తినాలనే కోరిక ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చాలామంది వారి కోరికలను తీర్చుకునేందుకు రోడ్డు పక్కన దొరికే జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ అది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మరీ ముఖ్యంగా చలి కాలంలో ఇలాంటివి ఎక్కువగా తింటారు. అయితే వాటికి బదులుగా చలికాలంలో పాయ సూప్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ పాయ సూప్ రుచిగా ఉండడమే కాకుండా ఎన్నో పోషక గుణాలను కలిగి ఉంటాయి. దీంతో ఆరోగ్యానికి ఆరోగ్యం నోటికి రుచి దొరుకుతుంది. అలాగే వేడివేడి పాయ తాగడం వలన శరీరం వెచ్చగా ఉండడంతో పాటు జలుబు దగ్గు వంటి సీజనల్ వ్యాధుల నుంచి కూడా రక్షణ పొందవచ్చు. మరి ఈ పాయ సూప్ తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
Mutton Bone Soup ఎముకలకు బలం…
పాయ సూప్ తాగడం వలన ఎముకలు చాలా దృఢంగా తయారవుతాయి. పాయ సూప్ లో ఉండే మినరల్స్ పాస్పరస్ ,మెగ్నీషియం ,కాల్షియం ,సోడియం ,క్లోరైడ్ పొటాషియం వంటి పోషకాలు ఎముకలను దృఢంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయి.
బరువు తగ్గడానికి : బరువు తగ్గాలి అనుకునే వారికి పాయ సూప్ మంచి ఔషధం అని చెప్పవచ్చు. ఈ పాయ సూప్ లో క్యాలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాక కడుపు ఎక్కువసేపు నిండుగా అనిపిస్తుంది. దీంతో బరువు తగ్గాలి అనుకునేవారు సులువుగా బరువు తగ్గవచ్చు.