Health Benefits : రక్తపోటు, స్టమక్ ప్రాబ్లమ్స్ మటుమాయం.. నూగు దోస ఆయుర్వేద ప్రయోజనాలు
Health Benefits : నూగు దోస లేదా ముసుముసు కాయ్ అని పిలిచే ఈ కాయలను అడవిలో.. పల్లెటూర్లల్లో రోడ్ల పక్కన చూస్తుంటాం. ఈ కాయలు, ఆకుల వలన కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు. ఆయుర్వేద పరంగా మానవాళికి ఎంతో మేలు చేస్తోంది. ఈ చిన్న చిన్న కాయలు చూడటానికి చిన్న దోసకాయల్లాగా ఉంటాయి. కాయ లోపల విత్తనాలతో ఉండి రుచి కూడా ఆల్మోస్ట్ దోసకాయల్లాగే ఉంటుంది. ఇందులో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కాయలు కుకుర్బుటేసి కుటుంబానికి చెందినవి. వీటిని ముకియా మడెరా స్టాటనా, కుకుమస్ ముఖ మడెరాస్పాటనా, మదరాస్ పీ పంప్కిన్, రఫ్ బ్రయోనీ వంటి పేర్లతో ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు.
ఈ నూగుదోస కాయలు, మొక్క ఎన్నో ఆయుర్వేద ప్రయోజనాలను కలిగి ఉంది. మల బద్దకం, గ్యాస్ సమస్యలు, ఆందోళన, పిత్తాశయం, అజిర్తీ ఆకలి లేకపోవడం, యాసిడ్స్ పైకి తన్నడం, పంటి నొప్పి, ఉబ్బసం, పొడి దగ్గు, ఉబ్బసం, రక్తపోటు మరియు మదుమేహం వంటి వాటిని కంట్రోల్ చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది.ఉబ్బసం కోసం నూగు దోస రసాన్ని మిరియాలతో కొన్ని గంటలు నానబెట్టాలి. దీన్ని ఎండలో ఆరబెట్టి పొడిచేయాలి. ఈ పొడిని రెండు గ్రాముల తేనెతో కలపి తమలపాకు మీద తీసుకుని తినాలి. ఇలా చేస్తే ఉబ్బసం నుంచి ఉపశమనం పొందవచ్చు.బలహీనమైన కఫ, పిత్త పరిస్థితులకు చికిత్స చేయడానికి ఈ హెర్బ్ ఉపయోగపడుతుంది.
Health Benefits : ఉబ్బసం నుంచి ఉపషమనం..
ఔషద లక్షణాలకు ఉపయోగపడే ఫినాలిక్స్ ఈ మొక్కలో పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇది మంచి ముత్ర విసర్జన కారి జీర్ణాశయ సమస్యలు, యాంటిపైరెటిక్, యాంటీఫ్లాటులెంట్ యాంటీ ఆస్మాటిక్, యాంటీబ్రొన్కైటీస్ తో పాటుగా వెర్టిగో, పిత్తాశయం చికిత్సలో ఉపయోగపడుతుంది.ఈ మొక్క ఆకుల కషాయాలను రక్తపోటు చికిత్సలో తమిళనాడులోని సిద్ద వైద్యులు ఉపయోగించారు.ఇది ఆయుర్వేదంలో పంటినొప్పి నుంచి ఉపశమనం పొందడానికి వాడతారు. నుగు దోస వినియోగం యాంటి ఆక్సిడెంట్ సామర్థ్యాన్ని బలోపేతం చేసిందని రక్తపోటు ఉన్న రోగులలో గ్లైకొప్రోటీన్ భాగాలను తగ్గిస్తుందని తేలింది.