Onion Juice : పరిగడుపున ఉల్లిపాయ రసాన్ని తీసుకుంటే… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Onion Juice : పరిగడుపున ఉల్లిపాయ రసాన్ని తీసుకుంటే… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో…!

Onion Juice : ఉల్లిపాయలు అనేవి ప్రతి ఒక్కరి వంట గదిలో కచ్చితంగా ఉంటాయి. ఇవి లేకుండా అసలు కూర చేయలేము. అయితే ఈ ఉల్లిపాయ రసంలో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా.ఈ ఉల్లిపాయ రసంలో యాంటీ ఎనర్జీ,యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ కర్సినో జెనిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉన్నాయి. అలాగే ఈ ఉల్లిపాయ ఎన్నో సమస్యల నుండి కూడా రక్షిస్తుంది. అయితే ఉల్లిపాయ రసం రక్తపోటును నియంత్రించటంలో మరియు బరువును […]

 Authored By ramu | The Telugu News | Updated on :10 July 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Onion Juice : పరిగడుపున ఉల్లిపాయ రసాన్ని తీసుకుంటే... ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో...!

Onion Juice : ఉల్లిపాయలు అనేవి ప్రతి ఒక్కరి వంట గదిలో కచ్చితంగా ఉంటాయి. ఇవి లేకుండా అసలు కూర చేయలేము. అయితే ఈ ఉల్లిపాయ రసంలో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా.ఈ ఉల్లిపాయ రసంలో యాంటీ ఎనర్జీ,యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ కర్సినో జెనిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉన్నాయి. అలాగే ఈ ఉల్లిపాయ ఎన్నో సమస్యల నుండి కూడా రక్షిస్తుంది. అయితే ఉల్లిపాయ రసం రక్తపోటును నియంత్రించటంలో మరియు బరువును కంట్రోల్ చేయడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే శరీరం నుండి నిర్వికరణలో ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Onion Juice : దంతాలు, చిగుళ్ళు

ఈ ఉల్లిపాయ రసం దంతాలు మరియు చిగుళ్ళకు ఎంతో బాగా ఉపయోగంగా ఉంటుంది. అలాగే దంతాలు మరియు చిగుళ్లలో నొప్పిని బలపరచడమే కాక తొందరగా ఉపశమనాన్ని కలిగిస్తుంది. దీని కోసం మీరు ప్రతి రోజు ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసాన్ని తీసుకుంటే చాలు..

Onion Juice : రక్తపోటు

రక్తపోటును నియంత్రించడంలో కూడా ఈ ఉల్లిపాయ రసం ఎంతో బాగా మేలు చేస్తుంది. అలాగే దీనిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. దీని వలన అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగం పని చేస్తుంది అని నిపుణులు అంటున్నారు..

రోగనిరోధక శక్తి : ఉల్లిపాయ రసాన్ని తీసుకోవటం వలన రోగ నిరోధక శక్తి అనేది ఎంతగానో మెరుగుపడుతుంది. అలాగే ముఖ్యంగా మారుతున్నఈ సీజన్ లో దీనిని తీసుకోవటం వలన సిజనల్ ఇన్ఫెక్షన్లు కూడా దూరం దూరం అవుతాయి..

బరువు తగ్గటం : బరువు తగ్గడానికి ఈ ఉల్లిపాయ రసం ఎంతో మేలు చేస్తుంది. ఈ ఉల్లిపాయ రసాన్ని ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని ఉదయం లేవగానే పరిగడుపున తీసుకోవాలి. ఇలా చేయడం వలన శరీరంలోని కొవ్వు తొందరగా కరుగుతుంది. అంతేకాక శరీరంలోని టాక్సిన్స్ కూడా మూత్రం ద్వారా బయటకు వెళతాయి..

వాపు : ఉల్లిపాయ రసం తీసుకోవటం వలన శరీరానికి శక్తిని ఇవ్వటమే కాక యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు కూడా అధికంగా ఉన్నాయి. ఇది శరీరం నుండి వాపులను నియంత్రించడంలో కూడా ఎంతో బాగా మేలు చేస్తుంది..

చెడు కొలేస్ట్రాల్ చెక్ : ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఉల్లిపాయ రసాన్ని తీసుకోవటం వలన రక్తంలోని టాక్సిన్స్ ను తొందరగా నియత్రి స్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ ను కూడా కరిగిస్తుంది. ఇది రక్త ప్రసరణకు ఎంతో మేలు చేస్తుంది. ఈ ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు రోగనిరోధక శక్తి ని బలోపెతం చేయడంలో కూడా సహాయం చేస్తుంది.

Onion Juice పరిగడుపున ఉల్లిపాయ రసాన్ని తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో

Onion Juice : పరిగడుపున ఉల్లిపాయ రసాన్ని తీసుకుంటే… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో…!

తయారీ విధానం : దీనికోసం ఒక ఉల్లిపాయను తీసుకోవాలి. తరువాత దానిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను వేరు చెయ్యాలి. ఒక చిన్న కప్పు ఉల్లిపాయ రసంలో ఒక స్పూన్ తేనె కలుపుకొని పరిగడుపున తీసుకోవాలి. ఇది మూత్రపిండంలో రాళ్లు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే రోజు ఇలా వాడుతూ ఉన్నట్లయితే తొందరలో కిడ్నీ రాళ్ల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే కిడ్నీలలో రాళ్లు తొందరగా కరుగుతాయి. అంతేకాక ఉదయం పరిగడుపున ఉల్లిపాయ రసాన్ని తీసుకోవడం వలన కీళ్ల నొప్పుల నుండి కూడా ఎంతో ఉపశమనం కలుగుతుంది.ఈ ఉల్లిపాయలో కాల్షియం అనేది అధికంగా ఉంటుంది. అలాగే కాల్షియం ఎముకలను ఎంతో బలోపెతం చేయగలదు. అంతేకాక మధుమేహం ఉన్నవారు ఉదయం పరిగడుపున ఈ ఉల్లిపాయ రసంలో ఏమి కలపకుండా తీసుకున్నట్లయితే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది