Health Benefits : ఎండాకాలంలో లభించే ఈ పండ్లను ఎప్పుడైనా తిన్నారా… ఇలాంటి వ్యాధులకు చెక్క్…?
ప్రధానాంశాలు:
Health Benefits : ఎండాకాలంలో లభించే ఈ పండ్లను ఎప్పుడైనా తిన్నారా... ఇలాంటి వ్యాధులకు చెక్క్...?
Health Benefits : ఎండాకాలం వచ్చిందంటే ఎన్నో రకాల పండ్లు ఈ సీజన్లలో లభిస్తాయి. కేవలం సీజన్లో మాత్రమే లభించే పనుల కోసం ప్రజలు సంవత్సరం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కువగా ఎండాకాలంలో అత్యంత ప్రత్యేకమైన పండుగా అభించేది పండ్లలో రారాజు అయినా మామిడిపండు. అయితే, మామిడిపండు సీజన్లో కేవలం 10 నుండి 20 రోజులు మాత్రమే మార్కెట్లో వచ్చి ఒక పండు గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఒక్కసారి ఈ పండు రుచిని చూశారంటే ఎప్పటికీ వదలరు. మళ్లీ ఆ సీజన్ వచ్చేవరకు మరచిపోరు. అంతేకాదు, ఈ పండు గుండెపోటును నివారించగలదు. ఇంకా, శరీర రక్తంలో చక్కెరలను నియంత్రించగలదు.

Health Benefits : ఎండాకాలంలో లభించే ఈ పండ్లను ఎప్పుడైనా తిన్నారా… ఇలాంటి వ్యాధులకు చెక్క్…?
Health Benefits మధుమేహం
షుగర్ పేషెంట్లు, ఆహారాన్ని సమతుల్య పద్ధతిలో తప్పనిసరిగా తీసుకోవాలి. రోజు తినే ఆహారం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను కూడా చూపించాలి. ఎందుకంటే, షుగరు ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలు తరచూ తక్కువగా లేదా ఎక్కువగా ఉండడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే, షుగర్ పేషంట్లకి ఇక్కడ గుడ్ న్యూస్ చెప్పబడినది. ఇప్పుడు షుగర్ ఉన్నవారికి అంతా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కారణం, వేసవిలో షుగర్ బాధితులు వారి చక్కర స్థాయిలను సమతుల్యంగా ఉంచే కొన్ని పనులను తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఇలాంటి ఆరోగ్యకరమైన పండ్లలో ప్రత్యేకమైన ఒక పండు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచగలదు. అని చెబుతున్నారు ఫాల్సా…
Phalsa Fruit ఫాల్సా పండు : ఈ ఫాల్సా ఒక రుచికరమైన తీయని పండు. ఈ పండులో విటమిన్లు, పొటాషియం, ఖనిజాలు, మెగ్నీషియం,బాస్వరం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుటకు దోహదపడతాయి. ఇంకా, ఈ ఫాల్సాలో కాల్షియం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లో కూడా కలిగి ఉంటాయి. అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేయిస్తాయి. రక్తహీనత సమస్యతో బాధపడే వారికి ఈ ఫాల్సా పండు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండు శరీరంలోని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ ఫాల్సా పండులో విటమిన్ సి లోపాన్ని తీరుస్తుంది. ఈ పండు రక్తపోటును, కొలెస్ట్రాల స్థాయిలను సమానంగా ఉంచుతుంది. ఈ ఫాల్సా పండు షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో ప్రయోజనకరంగా పనిచేస్తుంది. పండు తింటే రక్తంలోని చక్కర స్థాయిలో సమతుల్యంగా ఉంటాయి. వ్యాధుల నుంచి రక్షించుటకు యాంటీ ఆక్సిడెంట్లు కూడా కలిగి. అంతేకాదు, ఫాల్సా లో ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది.జిర్ణక్రియా రేటును మెరుగుపరుస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల మలబద్ధకం, ఆమ్లత్వం, గ్యాస్ వంటి సమస్యలను ఉపశమనం పొందవచ్చు.
యాంటీ ఆక్సిడెంట్ లో ఈ ఫాల్సా లో అధికంగా ఉంటాయి. ఇంకా, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుటకు, తాజా నిగారింపు కోసం, వృద్ధాప్య చాయలను దరిచేరనివ్వదు. ఉండడంవల్ల కొల్లాజన్ ఉత్పత్తి కూడా ఎక్కువ అవుతుంది. చర్మం తాజాగా మెరుస్తుంది. ఇందులో కొవ్వును కూడా తగ్గించే గుణాలు ఉన్నాయి. శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే తీరంలో వేడిని తగ్గిస్తుంది. శరీరం ఎప్పుడూ చల్లగా సౌకర్యంగా ఉండేలా చేస్తుంది. శరీరం వేడి నుంచి రిలీఫ్ నిస్తుంది.ఈ ఫాల్సా పండు తింటే ప్రోటీన్లతో పాటు పొటాషియం కూడా అందుతుంది. ఈ పండు కండరాల ఆరోగ్యానికి అవసరం. కణజాలాలను ఉత్పత్తి చేస్తాయి.