Ponnaganti kura : ఈ ఆకుకూరను వారంలో ఒక్కసారైనా తీసుకుంటే చాలు… ఏ రోగాలు మీ దరి చేరవు…!
ప్రధానాంశాలు:
Ponnaganti kura : ఈ ఆకుకూరను వారంలో ఒక్కసారైనా తీసుకుంటే చాలు... ఏ రోగాలు మీ దరి చేరవు...!
Ponnaganti kura : ఆకుకూరలలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇంకా ఎన్నో రకాల ఆకు కూరలు మన ముందుకు వస్తున్నాయి. ఈ ఆకుకూరలు ఏవైనా కూడా మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకుకూరలను రోజు తినకపోయినా వారంలో ఒక్కసారైనా మన ఆహారంలో తీసుకుంటే ఎన్నో రకాల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ ఆకుకూరలలో పొన్నగంటి ఆకుకూర కూడా ఒకటి. అయితే చాలామంది కేవలం తోటకూర, పాలకూర,గోంగూర మాత్రమే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ పొన్నగంటి ఆకు కూరను ఎక్కువగా తీసుకోరు. ఈ ఆకుకూరను తీసుకోవడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకుకూరను పోషకాల నిధి అని అంటుంటారు. ఈ ఆకుకూరలలో విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఈ ఆకుకూర అనేది ఏడాది పొడవున మనకు దొరుకుతుంది. ఈ ఆకుకూరలను తీసుకోవడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
Ponnaganti kura : రోగనిరోధక శక్తి పెరుగుతుంది
ఈ పొన్నగంటి ఆకుకూరలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. దీనిని తీసుకోవటం వలన శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది. దీనివలన రోగాలు మరియు ఇన్ఫెక్షన్లు,వైరస్ లతో పోరాడే శక్తి కూడా లభిస్తుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా రక్షించుకోవచ్చు…
రక్తహీనత సమస్య ఉండదు : ఈ ఆకుకూరలో ఐరన్ అధికంగా ఉంటుంది. కావున రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఈ ఆకు కూరను తీసుకుంటే ఈ సమస్య నుండి బయట పడవచ్చు. అలాగే ఐరన్ లోపం కూడా తగ్గుతుంది…
Ponnaganti kura డయాబెటిస్ కంట్రోల్
ఈ ఆకుకూరను తీసుకున్నట్లయితే షుగర్ వ్యాధి కూడా కంట్రోల్ లోకి వస్తుంది. అయితే డయాబెటిస్ పేషెంట్లు ప్రతిరోజు మీ ఆహారంలో ఈ ఆకుకూరను చేర్చుకోవాలి. దీనిలో ఫైబర్ మరియు యాంటీ డయాబెటిక్ లక్షణాలు కూడా ఉన్నాయి. కావున రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి అదుపులో ఉంటాయి…
చర్మానికి మేలు : ఈ ఆకుకూరను తీసుకోవటం వలన చర్మానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఈ ఆకుకూరలలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ ఏ సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి…
క్యాన్సర్ కణాలు నశిస్తాయి : ఈ ఆకుకూరలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ ఆకు కూరను తీసుకోవటం వలన శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలు అనేవి నాశనం అవుతాయి…
కంటి ఆరోగ్యం : ఈ ఆకుకూరలో విటమిన్ ఏ కూడా దొరుకుతుంది. ఈ విటమిన్ అనేది కంటి ఆరోగ్యాన్ని పెంచడంలో ఎంతో మేలు చేస్తుంది. అలాగే కంటికి సంబంధించినటువంటి అన్ని సమస్యలను కూడా నయం చేస్తుంది. అంతేకాక కంటి చూపు కూడా ఎంతో మెరుగుపడుతుంది…