Turmeric Jaggery : చలికాలంలో ఈ రెండిటిని కలిపి తీసుకుంటే చాలు… అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం…!!
ప్రధానాంశాలు:
Turmeric Jaggery : చలికాలంలో ఈ రెండిటిని కలిపి తీసుకుంటే చాలు... అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం...!!
Turmeric Jaggery : చలికాలం రానే వచ్చేసింది. ఈ కాలంలో ఉదయం 8 దాటినా కూడా చలి తివ్రత అనేది అసలు తగ్గడం లేదు. ఈ చలి తీవ్రత అనేది నవంబర్ లోనే ఇలా ఉంటే జనవరి మరియు ఫిబ్రవరి నెలలో ఇంకెలా ఉంటుందో అని ప్రజల్లో ఆందోళన మొదలైంది.అయితే ఈ చలి ని తట్టుకోవడానికి పోషకాహారం చాలా అవసరం అని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఆయుర్వేద ప్రకారం చూస్తే చలికాలంలో పసుపు మరియు చిన్న బెల్లం ముక్కతో మీ రోజును మొదలుపెట్టడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు అని అంటున్నారు నిపుణులు. ఇది మీలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఈ చలికాలంలో పసుపు మరియు చిన్న బెల్లం ముక్కను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
పసుపులో కర్కుమిన్ మరియు ఐరన్,విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అలాగే బెల్లం లో కాల్షియం మరియు పొటాషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్ లు ఉన్నాయి. ఇవి మనల్ని ఎంతో కాలం పాటు ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. అయితే ఈ రెండు పసుపు మరియు బెల్లం కలిపి తీసుకోవడం వలన బలహీనమైన రోగనిరోధక శక్తి బలంగా తయారవుతుంది అని అంటున్నారు. అంతేకాక జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు కూడా ఈ రెండు ఎంతో బాగా హెల్ప్ చేస్తాయి. ఇది మీ జీర్ణ ప్రక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అయితే ఈ బెల్లం అనేది పేగు కదలికలను ప్రేరేపిస్తుంది. అలాగే మలబద్దక సమస్య నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది.
పసుపు కాలేయ పనితీరుకు తోడ్పడే నిర్వీకరణ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అయితే ఈ బెల్లం అనేది మన శరీరంలో విష పదార్థాలను బయటకు పంపించడం ద్వారా శరీరాన్ని క్లీన్ చేస్తుంది. అలాగే ఈ పసుపు ఇమ్యునోమేడ్యులేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను తగ్గించడం లో కూడా హెల్ఫ్ చేస్తుంది. అలాగే ఈ బెల్లం ఇతర ఖనిజాలు మరియు విటమిన్ లకు మంచి మూలం అని చెప్పొచ్చు. ఇది మొత్తం ఆరోగ్యానికి కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వలన శరీరం రక్షణ విధానాలను బలంగా చేస్తుంది అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు