Rose Tea : రోజు గులాబీల టీ తాగితే ఇన్నీ లాభాల…
Rose Tea : మనకు హెర్బల్ టీలు తాగడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ టీ తాగడం కన్న పాలు, పంచదార టీ పౌడర్ కలిపి ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. అయితే అలాంటి రుచికరమైన టీ ని అలాగే ఆరోగ్యకరమైన తిని తాగితే ఎన్ని లాభాలు మనం తెలుసుకోబోతున్నాం.. అదే గులాబీ ల టీ. ఒక గులాబీ పూల టీ తాగితే ఎన్నో లాభాలు.. గులాబీ పువ్వులు గురించి ఎవరికీ పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.. వాటి అందానికి సువాసనకు దాసోహం కాని వారు ఎవరూ ఉండరు.
గులాబీ పూల రేకులు అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తాయి. ఈటీ ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పాత్ర స్టవ్ పైన పెట్టి దానిలో నీటిని వేసి తర్వాత దానిలో గులాబీ రేకులు వేసి బాగా మరిగించాలి. ఇవి నీటిని మరిగిన తర్వాత ఆ నీటిని వడకట్టి దానిలో తేనె కలుపుకోవాలి. ఈ టీ లో గ్రీన్ టీ బ్యాగులను వేసుకోవాలి. అలా వేసిన తర్వాత గ్రీన్ టీ బ్యాగ్ ని తీసి పక్కన పెట్టి ఆ టీ ని గోరువెచ్చగా ఉండగానే త్రాగాలి. ఈటీ ని త్రాగడం వలన నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ప్రతిరోజు ఒక కప్పు గులాబీల టీ తాగితే ఒత్తిడి తగ్గుతుంది. నిద్రలేమితో ఇబ్బంది పడేవారు ఈ గులాబీల టీ ని ప్రతిరోజు తాగితే మంచి మేలు జరుగుతుంది..
ఆడవారు ఈటీని తాగితే మంచి ఔషధంలా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఈ గులాబీల టీ తాగే ఆడవారిలో రుతుక్రమ సమస్యలు దరిచేరవని నిపుణులు చెప్తున్నారు. రుతుక్రమ సమస్య సమయంలో వచ్చే నొప్పి నుంచి బయటపడవచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అలాగే ఈ తిని రోజు తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో విటమిన్ సి శరీరంలోని టాక్సిన్ బయటికి పంపించేస్తుంది. ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. దాంతో శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్ధ్యాన్ని పెంచుకుంటుంది. ప్రతిరోజు జలుబు, దగ్గు ప్లూ లాంటి లక్షణాలతో ఇబ్బంది పడేవారు ఈ టీ ని తీసుకుంటే మంచి ఫలితాలను చూడవచ్చు…