Sesame Milk : ఈ కొత్త రకమైన పాలు ఎప్పుడైనా తాగారా..? దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. షాకే..?
ప్రధానాంశాలు:
Sesame Milk : ఈ కొత్త రకమైన పాలు ఎప్పుడైనా తాగారా..? దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. షాకే..?
Sesame Milk : మనం నిత్యం తాగే ఆవు,గేదె పాలు కంటే ఎక్కువ పోషక విలువలు ఉన్న ఈ పాల గురించి తెలుసా… అంతేకాదు మనలో చాలామంది సోయపాలు, బాదం పాలు గురించి తెలుసు.. కానీ నువ్వులతో చేసే పాల గురించి ఎప్పుడైనా విన్నారా… అవేనండి సీసేమ్ సీడ్స్ తో చేసే పాల గురించి తెలుసా.. ఎంతమందికి తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియదు… మరి తెలియని వారి కోసం, ఈ పాలతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో ఏ పోషకాలు కలిగి ఉన్నాయి అని తెలుసుకుందాం. మనం రోజు తాగే పాలు లాగానే, సోయా పాలు, బాదంపాలు నుంచి మనకి తెలిసిన విషయమే. అని నువ్వులతో చేసిన పాల గురించి చాలా తక్కువ మందికి అవగాహన ఉంది. మామూలుగా అయితే నువ్వుల నూనె తెలుసు మనకి, నువ్వులతో నూనెను తయారు చేస్తారని తెలుసు. అలాగే నువ్వుల లడ్డూలు కూడా చేస్తారు. స్వీట్ షాప్ లలో నువ్వుల స్వీట్లు తయారు చేస్తారు. కానీ నువ్వులతో పాలు కూడా తయారు చేస్తారు. విషయం మనకి తెలియదు. ఈ పాల వలన మనకు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా.. ఈ నువ్వుల పాలలో సాధారణ పాల కంటే ఎక్కువ ప్రోటీన్లను, కాల్షియం, ఐరన్,ఫైబర్,విటమిన్లు పోషకాలు పుష్టిగా ఉంటాయి. అయితే నువ్వుల నుంచి పాలను ఎలా తయారు చేస్తారు వీటి పోషక విలువలు ఏమున్నాయి అని తెలుసుకుందాం..
Sesame Milk నువ్వుల పాల తయారీకి కావలసిన పదార్థాలు
. తెల్ల నువ్వులు -ఒక కప్పు
. వాటర్ -1/2కప్పు
. వెన్నెల పౌడర్ -3 స్పూన్లు
. తేనె – 1 స్పూన్
నువ్వుల పాల తయారీ విధానం :
మొదట నువ్వులను ఒక గిన్నెలో వేసుకోవాలి, తరువాత వాటిని బాగా కడిగి వాటర్ పోసి రెండు నుంచి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి. పాత నువ్వులను మిక్సీలో వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ బాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పాలను వేరు చేసి కొంచెం వెన్నెల పౌడర్ ని, కొంచెం తేనెను వేసి బాగా కలపాలి. నువ్వులు పాలు తయారైనట్లే.
పువ్వుల పాలతో ఆరోగ్య ప్రయోజనాలు :
. నువ్వుల పాలలో మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. కావున ఎముకలను బలంగా ఉంచుతాయి.
. ఈ నువ్వుల పాలలో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కావున జీర్ణక్రియ మెరుగుపడి, శరిరంలోని చెడు కొలెస్ట్రాల్ను కరిగించి వేస్తుంది.
. చర్మానికి ఆంటీ ఆక్సిడెంట్లుగా, విటమిన్లు, ఖనిజాలు అందించటం వల్ల చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
. ఈ నువ్వుల పాలలో యాంటీ ఆక్సిడెంట్ లో శరీరంలోని వాపును తగ్గించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
. జీర్ణ వ్యవస్థ మెరుపు పడటానికి, మలబద్ధకం వంటి సమస్యలు నివారించడానికి ఈ నువ్వుల పాలు సహకరిస్తాయి.
. అంతేకాదు షుగర్ స్థాయిలని నియంత్రించుటకు కూడా నువ్వుల పాలు ఉపయోగపడతాయి.
. పూలపాలలో ఉండే పోషకాల వల్ల రోగనిరోధక శక్తి పెరిగే శరీరాన్ని బలపరుస్తుంది.
. ఈ పాలు మంచి కొలెస్ట్రాలను పెంచి, కొలెస్ట్రాలను బయటకు పంపి వేస్తుంది.