Health Benefits : వీటిని 12 గంటలు నానబెట్టి తిన్నారంటే… ఆరోగ్య లాభాలెన్నో…
Health Benefits : కొందరు డెలివరీ అయ్యాక ఈజీగా బరువు పెరుగుతారు. అలాంటివారు బరువు పెరగకుండా ఉండాలంటే ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. సోయా చిక్కుడు గింజలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. సుమారుగా 430 క్యాలరీల వరకు శక్తి లభిస్తుంది. వీటిని తింటే శరీరానికి అధిక బలం చేకూరుతుంది. కనుక వీటిని 12 గంటలకు నానబెట్టి వాటిని కొబ్బరి ఉపయోగించి కూర వండుకుంటే మంచి బలం వస్తుంది. కొబ్బరి వలన బ్రెయిన్ డెవలప్మెంట్ కి కావాల్సిన అన్ని పోషకాలు లభిస్తాయి. అందువలన బాలింతలు కొబ్బరి ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. కొబ్బరి ఎక్కువగా తింటే పిల్లలకు పాలు బాగా వస్తాయి. అంతేకాకుండా తల్లికి మంచి బలం అందుతుంది. బరువు కూడా పెరగరు. ఇలాంటి ఆరోగ్యకరమైన సోయచిక్కుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు: ఒక కప్పు నానబెట్టిన సోయా గింజలు, ఒక కప్పు చిక్కుడు గింజలు, రెండు కప్పుల పుల్లటి మజ్జిగ, ఒక కప్పు టమాటా ముక్కలు, అర కప్పు కొబ్బరి తురుము, ఒక కప్పు పెరుగు, అరకప్పు వేయించిన వేరుశనగలు, ఐదు ఆరు పచ్చిమిర్చి ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం, రెండు స్పూన్ల మీగడ వన్ టేబుల్ స్పూన్ షాజీరా ఒక టేబుల్ స్పూన్ మిరియాలు దాల్చిన చెక్క ఒకటి బిర్యానీ ఆకు ఒకటి అర టీ స్పూన్, పసుపు తగినంత కొత్తిమీర. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ముందుగా నానబెట్టుకున్న సోయా గింజలు, ఒక కప్పు పుల్లటి మజ్జిగ వేసి సోయ గింజలను ఉడకబెట్టాలి.
గ్రేవీ కోసం ముందుగా మిక్సీజార్ లో వేయించిన పల్లీలు, పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు కొద్దిగా పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ తీసుకొని దానిలో మిరియాలు, షాజీరా, కరివేపాకు, సన్నగా తురిమిన అల్లం ముక్కలు, చిక్కుడు గింజలు వేసి ఒక స్పూన్ మీగడ కూడా వేసి వేగనివ్వాలి. ఇప్పుడు పసుపు, పుల్లటి మజ్జిగ వేసి చిక్కుడు గింజలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న సోయా గింజలు మనం తయారు చేసుకుని మిశ్రమాన్ని వేసి బాగా ఉడకనివ్వాలి. గ్రేవీ బాగా ఉడికిన తర్వాత నిమ్మరసం, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అప్పుడు చిక్కుడు గ్రేవీ కర్రీ రెడీ అవుతుంది.