Health Benefits : బచ్చల కూరతో ఎన్ని లాభాలో.. తెలిస్తే అస్సలు వదలరు…
Health Benefits : ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఆకుకూరలలో బచ్చలి కూర ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే బచ్చల కూరను సర్వరోగ నివారిణిగా పేర్కొంటారు. అయితే మనలో చాలామంది బచ్చల కూర తినడానికి అంతగా ఇష్టపడరు. కానీ ఇందులో ఉండే లాభాల గురించి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా తినడానికి ఆసక్తి చూపుతారు. బచ్చల కూర ఎక్కువగా గ్రామాల్లో పట్టణాలలో ఇంటి పెరట్లో ఇంటిదగ్గర ఖాళీ ప్రదేశాలలో పండిస్తారు. బచ్చలి కూర సాగుకు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వేస్తే చాలు తీగల అల్లుకుపోతూ ఉంటుంది. ముఖ్యంగా బచ్చలి కూరను ఔషధాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.
బచ్చల కూరను పప్పులో వేసుకుని తింటే జ్వరం, జలుబు ఇట్టే తగ్గిపోతాయి. బచ్చలి కూర తినడం వలన కడుపులో మంట కూడా తగ్గుతుంది. సాధారణంగా పచ్చ కామెర్లు వచ్చినవారికి ఉపయోగించే చికిత్సలో బచ్చల కూరని ఎక్కువగా వాడుతారు. ఈ కూరను ఆహారంగా తీసుకున్నప్పుడు మనలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇక కంటి చూపు తగ్గిన వారికి బచ్చలి కూర బాగా పనిచేస్తుంది. అలాగే ఉబకాయంతో బాధపడే వారికి ఈ కూర మంచి మెడిసిన్. బాడీలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపిస్తుంది.
దీంతో విషతుల్యమైన పదార్థాలు ఏమైనా శరీరంలో ఉంటే అవి వెంటనే బయటకు వస్తాయి. బచ్చల ఆకులో ఉండే రసాన్ని జ్యూస్ గా చేసుకొని తాగడం వలన శరీరంలో వేరుకున్న మలినాలు అన్ని బయటకు వెళ్ళిపోతాయి. దీంతో పొట్ట శుభ్రం అవుతుంది. కడుపు ఉబ్బరం తగ్గి ప్రశాంతత లభిస్తుంది. జీర్ణవ్యవస్థ పరుతీరును కూడా మెరుగుపరుస్తుంది. బచ్చల కూరను బిపి ఉన్నవారు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మలబద్ధక సమస్య తగ్గుతుంది. కడుపుబ్బరం కూడా నయమవుతుంది. బచ్చల కూర తినడం వలన గ్యాస్ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.