Health Benefits : చలికాలంలో తప్పకుండా తినాల్సిన కూర ఇది ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : చలికాలంలో తప్పకుండా తినాల్సిన కూర ఇది ..!

 Authored By prabhas | The Telugu News | Updated on :24 November 2022,7:30 am

Health Benefits : చలికాలంలో చాలామంది రకరకాల ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. గరం గరంగా మిర్చి బజ్జీలు, చిల్లీతో చేసిన ఫ్రైడ్ రైస్లు తినడానికి ఇష్టపడతారు. కానీ జీవక్రియ రేటు వేసవిలో కంటే చలికాలంలో చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి శీతాకాలంలో వేయించిన ఆహార పదార్థాలను తింటే త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇక శీతాకాలంలో చాలామంది వ్యాయామం చేయడానికి బద్ధకిస్తారు. సోమరితనంతో శారీరక శ్రమ లేకపోవడం వలన ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఇటువంటి సమస్యలను తగ్గించుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.

అందులో ముఖ్యంగా బచ్చలి కూర ఎక్కువగా తినడం వలన ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. బచ్చలి కూర అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో వచ్చే అనేక అనారోగ్య సమస్యల నుంచి కూడా రక్షిస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఉంటే ఆహారంలో బచ్చలి కూరను తీసుకోవడం వలన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరంలో ఐరన్ పొటాషియం లోపాన్ని సవరించడంలో బచ్చలి కూర బాగా ఉపయోగపడుతుంది. బచ్చలి కూర మాత్రమే కాకుండా ఆహారంలో ఇతర ఆకుపచ్చ కూరలను కూడా చేర్చుకోవచ్చు.

Health Benefits of spinach

Health Benefits of spinach

గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు బచ్చలి కూరను తింటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. పాలకూరలో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల అది రక్తపోటు స్థాయిని సరిగ్గా ఉండేలా చేస్తుంది. అందుకే బచ్చలి కూరను తీసుకోవడం వలన గుండె సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. బచ్చలి కూరలో జియాక్సంతిన్, లూటిన్, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటాయి. కంటి ఆరోగ్యం చక్కగా ఉండాలంటే బచ్చలి కూరను తప్పనిసరిగా తినాలి. బచ్చలి కూరలో విటమిన్ కె, పొటాషియం, విటమిన్లు ఖనిజాలు ఉన్నాయి. రోజుకు ఒక కప్పు బచ్చల కూరను తింటే ఎముకలు బలంగా తయారవుతాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది