Sprouted Fenugreek Seeds : డయాబెటిస్ కు శాశ్వతంగా చెక్ పెట్టాలంటే… ప్రతిరోజు మొలకెత్తిన మెంతులను తీసుకోండి…??
ప్రధానాంశాలు:
Sprouted Fenugreek Seeds : డయాబెటిస్ కు శాశ్వతంగా చెక్ పెట్టాలంటే... ప్రతిరోజు మొలకెత్తిన మెంతులను తీసుకోండి...??
Sprouted Fenugreek Seeds : ప్రతి ఒక్కరి వంట గదిలో మెంతులు కచ్చితంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అయితే మొలకెత్తిన మెంతులు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. అయితే ఈ మొలకెత్తిన మెంతులలో విటమిన్స్ మరియు మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి అని నిపుణులు అంటున్నారు. అలాగే దీనిలో విటమిన్ సి తో పాటుగా విటమిన్ ఏ బి లు కూడా ఉంటాయి. అంతేకాక మొలకెత్తిన మెంతులలో ప్రోటీన్ మరియు కాల్షియం, ఫైబర్ తో పాటు ఇతర రకాల పోషకాలు కూడా ఉంటాయి. అయితే ఈ మొలకెత్తిన మెంతులను ప్రతి రోజు తీసుకోవటం వలన షుగర్ కంట్రోల్లో ఉండటమే కాక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అలాగే దీనిలో ఉండే పీచు పదార్థం పొట్టను ఎంతో మృదువుగా ఉంచుతుంది…
అలాగే ఇది జీవక్రియను కూడా పెంచుతుంది. అలాగే జీర్ణ క్రియకు కూడా ఎంతో మెలు చేస్తుంది. ఈ మొలకెత్తిన గింజలలో యాంటీ ఇన్ఫ్లోమెంటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని వాపులను నియంత్రిస్తాయి. అలాగే మొలకెత్తిన గింజలు అనేవి శరీరంలో చెడు కొలస్ట్రాల్ ను కూడా నియంత్రిస్తుంది. ఇది గుండె మరియు బిపి లాంటి ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది. అలాగే మొలకెత్తిన గింజలలో ఫైబర్ మరియు కేలరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. కావున ఇది బరువును అదుపులో ఉంచుతుంది. దీనిలో ఉన్న విటమిన్ సి అనేది శరీరంలో రోగనిరోధక శక్తిని బలంగా చేస్తుంది. అలాగే దీనిలో ఉన్నటువంటి పైటో ఈస్ట్రోజన్ ప్రభావాలు స్త్రీ పురుషుల హార్మోన్ల సమతుల్యతను రక్షిస్తాయి…
అలాగే మోనోపాజ్ మరియు పి ఎం ఎస్ తో ఇబ్బంది పడే మహిళలకు మొలకెత్తిన గింజలు ఎంతో బాగా సహాయపడతాయి. అలాగే మొలకెత్తిన మెంతులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలు మరియు ఎముకలను ఎంతో బలంగా చేస్తుంది. అయితే మెంతులు మొలకత్తాలి అంటే ముందుగా గింజలను రాత్రి మొత్తం బాగా నానబెట్టాలి. మీరు ఉదయం లేచిన వెంటనే మెంతుల నుండి నీటిని తీసేసి వాటిని ఒక గుడ్డలో కట్టాలి. ఆ తర్వాత రెండు మూడు రోజులు దానిని అలా వదిలేయాలి. రెండు రోజుల తర్వాత మెంతులు మొలకలు వస్తాయి