Thati Bellam : తాటి బెల్లంతో దిమ్మ తిరిగే ప్రయోజనాలు… మరి ముఖ్యంగా మహిళలకు…!
ప్రధానాంశాలు:
Thati Bellam : తాటి బెల్లంతో దిమ్మ తిరిగే ప్రయోజనాలు... మరి ముఖ్యంగా మహిళలకు...!
Thati Bellam : బెల్లం తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలిసిందే. అయితే ఈ సాధారణ బెల్లం కంటే కూడా తాటి బెల్లం తినడం ఇంకా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే తాటి బెల్లం లో శరీరానికి కావాల్సిన పోషక విలువలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాక దీనిని చేక్కరకు ప్రత్యామ్నాయంగా కూడా వాడుకోవచ్చట. అంతేకాక మహిళల్లో ఎదురయ్యే కొన్ని సమస్యలకు ఇది చక్కటి పరిష్కారమని అనారోగ్య సమస్యలను దూరం చేసేందుకు తాటి బెల్లం దివ్య ఔషధమని చెబుతున్నారు. మరి దీని వలన కలిగే ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం.
తాటి బెల్లం లో ఐరన్ మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంతోపాటు చర్మాన్ని సంరక్షించడంలో ఎంతగానో సహాయపడతాయి. అంతేకాక తరచూ తాటి బెల్లం తీసుకోవడం వలన క్యాల్షియం పొటాషియం పెరిగి ఎముకలు దృఢంగా ఉంటాయి. అంతేకాక మహిళలు ఎదుర్కొనే నెలసరి సమస్యలకు తాటి బెల్లం మంచి ఉపకారం అని నిపుణులు చెబుతున్నారు. అలాగే బరువు తగ్గాలి అనుకునేవారు తాటి బెల్లంతో టీ కాఫీ వంటివి తాగడం వలన సులువుగా బరువు తగ్గుతారు.
అలాగే జీర్ణ సమస్యలను తగ్గించేందుకు , మలబద్ధకాన్ని నివారించేందుకు తాటి బెల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది.అలాగే తాటి బెల్లం లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. దీంతో అజీర్ణం మలబద్ధకం వంటిసమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాక వేసవికాలంలో ఎండ వేడి నుండి ఉపశమనం పొందేందుకు తాటి బెల్లం తీసుకోవచ్చు.అలాగే పొడి దగ్గు జలుబు వంటి సమస్యలకు ఇది దివ్య ఔషధం.