Health Benefits : ఈ రెండు కలిపి పూయాలి… ఇలా చేస్తే పులిపిర్లు వెంటనే రాలిపోతాయి..
Health Benefits : పులిపిర్ల సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. వీటిని ఉలిపిరి కాయాలని కూడా అంటారు, ఇంగ్లీష్‌లో వార్ట్స్ అంటారు. అయితే ఈ పులిపిర్లు హ్యూమన్ ప్యాపిలోమా అనే వైరస్ వల్ల ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా ముఖం, మెడ, చేతులు, పాదాలపై వస్తుంటాయి. కాగా రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు కొన్ని రకాల వైరస్‌లు అటాక్ చేస్తాయి. దీంతో కొందరిలో పులిపిర్లు ఏర్పడతాయి. పులిపిర్లను కత్తిరించటం, కాల్చటం వంటివి చేయకూడదు. ఇవి ఎక్కువగా రాపిడిగా ఉండే ప్రాంతాల్లోనే ఏర్పడతాయి. కాగా కొన్ని సహజ చిట్కాలు పాటంచి వీటిని మాయం చేయొచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం.
చర్మ వ్యాధుల నివారణకు వెల్లులి మంచి ఔషదం. ఇందులో ఉండే ఎల్లిసిన్.. ఫంగస్, వైరస్ వంటి బ్యాక్టీరియాలతో పోరాడుతుంది. అలాగే పులిపిర్లను తొలగించడంలోనూ ఇది అత్యుత్తమంగా పనిచేస్తుంది. ఇందుకు మీరు వెల్లులి ముద్దగా చేసుకుని పులిపిర్లు ఉన్నచోట రాసి ఓ గంట ఆరనివ్వాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే పులిపిర్లు రాలిపోతాయి. దీంతో ఎలాంటి సమస్యలు, సైడ్ ఎఫెక్టులు ఉండవు కాబట్టి పులిపుర్లు ఉన్నవారు ప్రయత్నించవచ్చు. ఆముదంలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పులిపిర్లపై రాసి బ్యాండేజ్ వేసి రాత్రంతా ఉంచాలి. ఇలా మూడు రోజులు చేస్తే పులిపిర్లు పూర్తిగా తొలగిపోతాయి.
ఉల్లిపాయలు ఇళ్లలో ఎప్పటికీ స్టాక్ ఉంటాయి. ఉల్లిపాయల్లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఉల్లిపాయలను పొట్టుతీసీ మిక్సిలో వేసి మెత్తగా పెస్ట్ చేసుకోవాలి. తర్వాత ఫిల్టర్ చేసి రసాన్ని తీయాలి. ఈ రసంలో కొబ్బరినూనే వేసి బాగా కలపాలి. తర్వాత దూదితో పులిపిర్లపై పూయాలి. ఆ తర్వాత బ్యాండేజ్ వేసి నైట్ అంతా ఉంచాలి. ఇలా రెగ్యూలర్ గా చేస్తే పులిపిర్లు రాలిపోతాయి. అలాగే కలబందలో ఉండే మేలిక్ యాసిడ్ పులిపిర్లలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కలబంద ఆకు మధ్యలో ఉండే జిగురును తీసుకుని పులిపిర్లపై రాస్తే పులిపిర్లు రాలిపోతాయి.