Diabetes : డ‌యాబెటిస్ కు నాచుర‌ల్ మెడిసిన్ … ఇక షుగ‌రు వ్యాధి ర‌మ్మ‌న్నా రాదు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : డ‌యాబెటిస్ కు నాచుర‌ల్ మెడిసిన్ … ఇక షుగ‌రు వ్యాధి ర‌మ్మ‌న్నా రాదు…

 Authored By anusha | The Telugu News | Updated on :12 June 2022,3:00 pm

Diabetes : ఈ త‌రం వారు ఎక్కువ‌గా డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. దీనిని నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌డానికి వివిధ ర‌కాల మెడిసిన్స్, డైట్, వ్యాయామాలు చేస్తూ వుంటారు. ఈ మూడింటిని ఎక్కువ‌గా ఫాలో అవుతూ వుంటారు.కానీ, ఏది మొద‌టిగా చేయాలి, ఏది చివ‌రిగా చేయాలి అనేది ప్రాధాన్య‌త ఇచ్చి చేయాలి. అయితే మ‌నం ఎక్కువ‌గా వైద్యుల స‌ల‌హా మేర‌కు ముందుగా మెడిసిన్స్, త‌రువాత వ్యాయామాలు, ఆ త‌రువాత డైట్ చేస్తూ వుంటాం. ఇలా చేస్తే ఎప్ప‌టికి షుగ‌రు వ్యాధి పోదు. మెడిసిన్స్, ఇంజ‌క్ష‌న్స్ వంటివి వాడుతూ వుండాలి.

ఇలా ఎక్కువ‌గా మెడిసిన్స్ తీసుకోకుండా, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా వుండాలి అనుకున్న వారు ముందుగా దేనికి ప్రాధాన్య‌త ఇవ్వాలి, ఎలా మారాలి అనే దాని గురించి తెలుసుకోవాలి. ముందుగా డైట్ చేయాలి. త‌రువాత వ్యాయామం, ఆ త‌రువాత మెడిసిన్ తీసుకోవాలి. ముఖ్యంగా డైట్ అనేది డ‌యాబెటిస్ కు చ‌క్క‌టి మెడిసిన్. త‌రువాత వ్యాయామం. ఈ రెండు స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తే మెడిసిన్స్ అవ‌స‌రం లేదు. ముందుగా మ‌నం తినే ఆహారంలో మార్పులు రావాలి. దీనికోసం ఉద‌యాన్నే అల్పాహారంలోకి దోసెలు, ఇడ్లీలు మానేసి, నాన‌బెట్టుకున్న శ‌న‌గ‌ల‌ను, మొల‌కెత్తిన గింజ‌ల‌ను, నాన‌బెట్టుకున్న ఎండుఖ‌ర్జురాల‌ను తినాలి.

Health Benefits to Diabetes with natural medicine

Health Benefits to Diabetes with natural medicine

త‌రువాత ఏమైనా పండ్ల‌ను తీసుకోవాలి. మ‌ధ్యాహ్నం లంచ్ లోకి మిల్లెట్స్ తో చేసిన రొట్టెను తినాలి.త‌రువాత సాయంత్రం కొబ్బ‌రి నీళ్ల‌ను తీసుకోవాలి. వీటిలో మిన‌ర‌ల్స్ ఎక్కువ‌గా ఉంటాయి. మ‌న బాడీలోని ర‌క్తంకు కావ‌ల‌సిన పోష‌కాలు ఈ నీళ్ల ద్వారా అందుతాయి. రాత్రికి డిన్న‌ర్ లోకి నాన‌బెట్టుకున్న డ్రై న‌ట్స్ ను తినాలి. త‌రువాత ఏమైనా పండ్ల‌ను తినాలి. రాత్రి ఏడుగంట‌ల లోపు డిన్న‌ర్ పూర్తి చేసుకోవాలి. రోజు ఉద‌యాన్నే రెండు గంట‌లు వ్యాయామం చేయాలి. ఇలా డైట్ ను ఫాలో అవుతూ వ్యాయామం చేస్తే షుగ‌రు వ్యాధి ర‌మ్మ‌న్నా రాదు…

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది